ETV Bharat / bharat

లాక్​డౌన్​ హీరో 'అంబులెన్స్​ మ్యాన్​' కథ తెలుసా? - ట్వింకిల్​ కలియా

హిమాన్షు కలియా.. తన ఆశయంతో ఎందరికో ప్రాణాలు పోస్తున్న దిల్లీవాసి. ఆపదలో ఉన్న వారికి ఉచితంగా సేవలందిస్తూ.. "అంబులెన్స్​ మ్యాన్"​గా ప్రసిద్ధి చెందారు. అయితే ఆయన జీవితాన్ని ఓ సంఘటన మార్చేసింది. ఏంటా సంఘటన? ఆయనకు అంబులెన్స్​ మ్యాన్​ అని పేరెలా వచ్చింది?

Meet Delhi's Ambulance Man
ఈ "అంబులెన్స్​ మ్యాన్​" కథ ఎందరికో ఆదర్శం!
author img

By

Published : May 17, 2020, 9:45 AM IST

కొన్ని కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్నే మార్చేస్తాయి. అవే మనల్ని సాధారణ మనుషుల నుంచి ఆసాధారణ వ్యక్తులుగా మారుస్తాయి. దిల్లీవాసి హిమాన్షు కలియా కథ కూడా ఇంతే. కొన్నేళ్ల క్రితం తన తండ్రికి జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. హిమాన్షును కుదిపేసింది. దాంతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మొదలు పెట్టిన ఆయన.. ఇప్పుడు "అంబులెన్స్​ మ్యాన్"​గా ప్రసిద్ధి చెందారు.

ఆ ఒక్క సంఘటన...

హిమాన్షు కలియాకు.. తన గతం ఎన్నో పాఠలు నేర్పింది. 14 ఏళ్ల వయస్సులో హిమాన్షు తండ్రి దిల్లీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు హిమాన్షు. రిక్షా సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.

ఆ సమయంలో హిమాన్షుకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తండ్రిని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్​ దొరకలేదు. చాలా సేపటిని ఓ ఆటో డ్రైవర్​.. హిమాన్షుకు దేవుడిలా ఎదురయ్యాడు. ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండానే.. తన తండ్రిని దిల్లీ ఎయిమ్స్​కు తీసుకెళ్లాడు.

కానీ అప్పటికే ఆలస్యమైంది. హిమాన్షు తండ్రి కోమాలోకి వెళ్లిపోయారు. అందులో నుంచి బయటపడి.. రెండున్నరేళ్లకు కోలుకున్నారు.

ఈ సంఘటన హిమాన్షు జీవితాన్నే మార్చేసింది. యాక్సిడెంట్​ సమయంలో తండ్రి ప్రాణాలు కాపాడమని అన్ని దేవుళ్లను ప్రార్థించిన హిమాన్షు... ఆ తర్వత తనకు జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదని కోరుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే శక్తి తనకు ఇవ్వని దేవుడిని వేడుకున్నారు.

హిమాన్షు జీవత భాగస్వామి ట్వింకిల్​ కలియా.. అయన సంకల్పాన్ని ఎంతో ప్రోత్సహించింది. ఓ అంబులెన్స్​ను వివాహ బహుమతిగా తీసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.

అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఆపదలో ఉన్నవారెందరికో హిమాన్షు సహాయం చేశారు. ఉచితంగానే అంబులెన్స్​ సేవలు అందించారు. అనేకమంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆయన తండ్రి కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు.

లాక్​డౌన్​లో దాదాపు 200 మందిని తన అంబులెన్స్​లో వివిధ ఆసుపత్రులకు చేర్చారు హిమాన్షు. వీరిలో 35-40మంది వైరస్​ బాధితులున్నారు.

హిమాన్షు, ట్వింకిల్​.. ఇద్దరూ ఇన్స్యూరెన్స్​ కన్​సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. అంబులెన్స్​ సేవలు అందించడానికి అయ్యే ఖర్చును చాలా వరకూ వీరిద్దరే చూసుకుంటున్నారు.

ట్వింకిల్​ కూడా ఆదర్శవంతమైన భార్యగా.. హిమాన్షు ఆశయానికి తన వంతు సహాయం చేస్తున్నారు. దిల్లీలోని తొలి మహిళా అంబులెన్స్​ డ్రైవర్​గా గుర్తింపు పొందిన ట్వింకిల్​.. 2019లో నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

ఇదీ చూడండి:- ఆ సాయం చేస్తానన్న ట్రంప్​కు మోదీ థ్యాంక్స్

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.