ETV Bharat / bharat

బంగాల్​: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు - అక్రమ బాణాసంచాను తరలిస్తున్న సీబీఐ అధికారులపై దాడి

బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో రాష్ట్ర సీఐడీ వాహనాలను కొంతమంది పేల్చేశారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తోన్న స్థావరాలపై సీఐడీ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు వాహనాలను పేల్చినట్లు అధికారులు తెలిపారు.

Massive explosion in Bengal's Naihati as firecrackers go off   while being defused
అక్రమ బాణాసంచాను తరలిస్తున్న సీబీఐ అధికారులపై దాడి
author img

By

Published : Jan 9, 2020, 9:26 PM IST

Updated : Jan 9, 2020, 11:38 PM IST

బంగాల్​: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు

బంగాల్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలో స్థానికులు రాష్ట్ర సీఐడీ వాహనాలను పేల్చివేశారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు సీఐడీ అధికారులు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అధికారులతో ఘర్షణకు దిగిన స్థానికులు, స్వాధీనం చేసుకున్న బాణసంచా ఉన్న వాహనాన్ని పేల్చేశారు. దీనితో పాటు పలు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.

ఈ దాడి వల్ల హుగ్లీ జిల్లాలోని చిన్సురాలో పలు ఇళ్లలోని కిటికీలు, అలాగే నౌహతీ రామ్​ఘాట్​ ప్రాంతంలోని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తమపై అక్రమంగా దాడి చేశారంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన చేశారు.

గత వారంలో అక్రమంగా బాణసంచాను తయారు చేస్తోన్న కర్మాగారంలో మంటలు చెలరేగి ఇద్దరు మహిళలతో సహా మొత్తం నలుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్​ ముష్కరుల అరెస్ట్​

Guwahati (Assam), Jan 09 (ANI): Assam's Finance Minister Himanta Biswa Sarma said that calling Prime Minister Narendra Modi India's "Hindu Jinnah" is alright, as long as it's "Hindu". "I am only concerned whether it is Hindu or not, because if you are Hindu, you are secular," the minister further added. Himanta Biswa Sarma made this statement in response to former Assam chief minister Tarun Gogoi's comment over PM Modi, that the latter is following Jinnah's two-nation theory.

Last Updated : Jan 9, 2020, 11:38 PM IST

For All Latest Updates

TAGGED:

west bengal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.