ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా - మనోజ్​ సిన్హా

Manoj Sinha to be the new Lieutenant Governor of Jammu and Kashmir as President Kovind accepts the resignation of Girish Chandra Murmu.
జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా
author img

By

Published : Aug 6, 2020, 7:16 AM IST

Updated : Aug 6, 2020, 7:55 AM IST

07:47 August 06

జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్​ సిన్హా నియమితులయ్యారు. గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు. ముర్ము తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తైన సమయంలో ముర్ము రాజీనామా చేయడం గమనార్హం. 

కొత్త కాగ్!

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా ముర్ము బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్ మెహర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ముర్మును నియమించినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 29న జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు తీసుకున్నారు ముర్ము. గుజరాత్​ క్యాడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అయిన ముర్ము.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టక ముందు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

07:14 August 06

జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా

జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా నియమితులయ్యారు. గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు.

Last Updated : Aug 6, 2020, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.