ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0లో ఏం చేయవచ్చు? ఏం చెయ్యరాదు? - లాక్​డౌన్​ 5.0 మార్గదర్శకాలు

సోమవారం నుంచి లాక్​డౌన్​ 5.0 అమలుకు త్రిశూల వ్యూహంతో పక్కా ప్రణాళికను రచించింది కేంద్రం. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. మరి ఈ నయా లాక్​డౌన్​లో మీరు ఏం చెయొచ్చు? ఏం చెయ్యకూడదు?

Lockdown 5.0 is set to begin from June 1 with fresh guidelines
లాక్​డౌన్​ 5.0లో ఏం చెయొచ్చు? ఏం చెయ్యకూడదు?
author img

By

Published : May 31, 2020, 7:07 PM IST

Updated : May 31, 2020, 9:00 PM IST

లాక్​డౌన్​ 5.0లో ఆర్థిక కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూ నూతన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది కేంద్రం. త్రిశూల వ్యూహంతో పక్కా ప్రణాళికను ప్రజల ముందు ఉంచింది. అందుకు సంబంధించి మీకున్న ప్రశ్నలకు ఇవే సమాధానాలు...

  • ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?

సోమవారం నుంచి జూన్​ 30 వరకు.

  • హోటళ్లు తెరుచుకుంటాయా?

లాక్​డౌన్​ 4.0 వరకు మూతపడ్డ ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర ఆతిథ్య సేవలకు సంబంధించిన సంస్థలు, షాపింగ్​ మాల్స్.. జూన్​ 8న తెరుచుకుంటాయి. ఆయా ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలపై సంబంధిత శాఖలతో చర్చించి, త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ.

  • మరి అంతరాష్ట్ర రవాణా పరిస్థితి ఏంటీ?

అంతరాష్ట్ర రవాణాకు కూడా అనుమతులిచ్చింది కేంద్రం. ప్రత్యేక అనుమతులు, ఈ-పాస్​ అవసరం లేదని తెలిపింది. అయితే.. కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా రవాణాపై ఆంక్షలు విధించాలని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే... కొత్త నిబంధనలపై విస్తృత ప్రచారం నిర్వహించి, తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.

  • పిల్లలు బడికి వెళ్లాలా?

విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు కనపడటం లేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించాకే పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు తెరవడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం వెల్లడించింది. విద్యా సంస్థలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించాలని సూచించింది.

  • వేటిపై నిషేధం కొనసాగుతుంది?

అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైల్, సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్య/సాంస్కృతిక/మత పరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. పరిస్థితి ఆధారంగా ఆయా కార్యకలాపాలు ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం.

  • రాత్రి పూట బయటకు వెళ్లొచ్చా?

లేదు. అత్యవసర కార్యకలాపాల కోసం మినహా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జన సంచారంపై నిషేధం అమల్లో ఉంటుంది.

  • కంటైన్​మెంట్​ జోన్ల నిబంధనల్లో మార్పులు చేశారా?

జూన్​ 30 వరకు కంటైన్​మెంట్​ జోన్లలో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్​మెంట్​ జోన్ల జాబితాను ఎప్పటికప్పుడు సవరించే బాధ్యత జిల్లా యంత్రాంగాలదేనని కేంద్రం తెలిపింది. కంటైన్​మెంట్​ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రజల రాకపోకలు నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది.

కంటైన్​మెంట్​ జోన్ల సమీపంలో కేసులు పెరిగేందుకు అవకాశమున్న బఫర్​ జోన్లను గుర్తించి, అవసరమైన ఆంక్షలు అమలు చేసే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగాలదే అని స్పష్టం చేసింది కేంద్రం.

  • వీటితోపాటు 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అత్యవసర, ఆరోగ్య అవసరాలు ఉంటే తప్ప ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచించింది ప్రభుత్వం.
  • ఉద్యోగులంతా సాధ్యమైనంత వరకు ఆరోగ్య సేతు యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకునేలా చూడాలని యాజమాన్యాలకు తెలిపింది. ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్​ ఇన్​స్టాల్​ చేసుకుని, తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకునే జిల్లా యంత్రాంగాలు సిఫార్సు చేయాలని పేర్కొంది.

Last Updated : May 31, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.