ETV Bharat / bharat

ప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్​ ఇవే... - ప్రధాని మోదీ

దిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 'ఆత్మనిర్భర్​ భారత్​' కేంద్రబిందువుగా ప్రసంగించారు. దేశం స్వావలంబనవైపు పరుగులు తీయాలని ఆకాక్షించారు. 90 నిమిషాల పాటు సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే...

Key points from PM Modi's Independence Day speech
ప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్​ ఇవే...
author img

By

Published : Aug 15, 2020, 3:51 PM IST

దిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసిన అనంతరం 90 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర్​ భారత్​ కేంద్రబిందువుగా సాగిన ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. దేశాభివృద్ధికి తన ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను వివరించారు. ప్రధాని మోదీ పూర్తి ప్రసంగంలోని హైలైట్స్​ ఇవే....

  • కరోనా సంక్షోభంలోనూ పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు భారత్​వైపు చూశాయి.
  • ఆత్మనిర్భర్​ భారత్​ అంటే దిగుమతులను తగ్గించుకోవడమే కాదు.. దేశ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం కూడా.
  • అంతరిక్ష పరిశోధనలను ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
  • గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి నమోదైంది. విధానాలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ప్రపంచ దేశాలు భారత్​పై నమ్మకం ప్రదర్శిస్తున్నాయి.
  • వ్యవసాయ రంగంలో స్వావలంబన, రైతుల్లో స్వయం సమృద్ధత... ఆత్మనిర్భర్​ భారత్​లో ప్రాధాన్యం. రైతులకు ఆధునిక మౌలికవసతులను అందించడం కోసమే రూ. లక్ష కోట్లతో 'వ్యవసాయ మౌలికవసతుల నిధి'ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
  • 'మేక్ ఇన్​ ఇండియా​','మేక్​ ఫర్​ వరల్డ్​' నినాదంతో ముందుకు సాగాలి.
  • జాతీయ మౌలికవసతుల ప్రాజెక్ట్​(ఎన్​ఐపీ) కోసం వివిధ రంగాల్లో 7 వేలకుపైగా ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. వీటితో మౌలికవసతుల రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి.
  • లోపాలను పూడ్చి.. యావత్​ దేశమంతా మల్టీ-మోడల్​ కనెక్టివిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​వైపు అడుగులు వేయాలి.
  • దేశంలో మౌలికవసతులు విస్తారంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.
  • నేషనల్​ హెల్త్​ మిషన్​తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.
  • రానున్న 1000రోజుల్లో 6లక్షల గ్రామాలకు ఆప్టికల్​ ఫైబర్​ అనుసంధానం.
  • కరోనా వ్యాక్సిన్​ వచ్చిన అనంతరం అందరికీ వ్యాక్సిన్​ అందే విధంగా ప్రణాళికలు.

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.