ETV Bharat / bharat

'శస్త్ర​ చికిత్స చేశాకే నోటి నిండా వెంట్రుకలు పెరిగాయి!​'

తినేటప్పుడు కంచంలో ఒక్క వెంట్రుక కనిపిస్తేనే.. అన్నం మింగుడు పడదు. అలాంటిది.. కేరళకు చెందిన స్టీఫెన్ నోటి నిండా వెంట్రుకలు పెరిగిపోయాయి. విపరీతంగా పెరిగిన అవాంఛిత రోమాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు స్టీఫెన్​. కనీసం నీళ్లు కూడా తాగలేని దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు. కేన్సర్​ వచ్చిందని వైద్యుల దగ్గరికెళితే నోట్లో రోమాలు పెరిగేలా శస్త్ర చికిత్స చేశారని లబోదిబోమంటున్నాడు.

Kerala man with  hair grows inside his mouth after doctors gave him cancer treatment
'శస్త్ర​ చికిత్స చేశాకే.. నోటి నిండా వెంట్రుకలు పెరిగాయి!​'
author img

By

Published : Feb 7, 2020, 3:01 PM IST

Updated : Feb 29, 2020, 12:50 PM IST

సాధారణంగా కేశాలు తలపై ఉంటే సౌందర్యాన్ని పెంచుతాయి.. శరీరం నిండా ఉంటే చికాకును తెప్పిస్తాయి. కానీ, కేరళ త్రివేండ్రంలో స్టీఫెన్​ నోటిలో పెరిగిన అవాంఛిత రోమాలు అతడిని భరించలేని వేదనకు గురిచేస్తున్నాయి.

'శస్త్ర​ చికిత్స చేశాకే.. నోటి నిండా వెంట్రుకలు పెరిగాయి!​'

వైద్యుల నిర్వాకం...

కొన్ని రోజుల క్రితం స్టీఫెన్​కు నోటి కేన్సర్​ సోకింది. చికిత్స కోసం త్రివేండ్రంలోని ఆర్​సీసీ ఆసుపత్రికి వెళ్లాడు. శస్త్రచికిత్స ద్వారా నోటిలోని ​కేన్సర్ భాగాలను తొలగించారు వైద్యులు. ఆ భాగంలో తొడ భాగం నుంచి తీసిన చర్మాన్ని అతికిస్తామని చెప్పి.. స్టీఫెన్​ గడ్డం (దవడ) భాగం నుంచి తీసిన చర్మాన్ని అంటుకట్టారు. ఆ తర్వాతే నోటిలో రోమాలు పెరిగే ఇబ్బంది మొదలైందని వాపోతున్నాడు స్టీఫెన్.

డాక్టర్​ గారి 'బార్బర్'​ సలహా

కొబ్బరి చెట్లెక్కే కూలీ పనికి వెళితే గానీ స్టీఫెన్​ బతుకు బండి నడవదు. కానీ, ఈ రోమాల కారణంగా అన్నం తినక, కనీసం నీరు తాగలేకపోవడం వల్ల చెట్లెక్కేందుకు శక్తి సరిపోవట్లేదు. అంతేకాదు.. నిత్యం నోట్లో అడ్డుగా తగులుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి రోమాలు.

ఇదేంటయ్యా అంటూ శస్త్ర చికిత్స చేసిన వైద్యుల దగ్గరికెళ్లాడు స్టీఫెన్​. 'నోట్లో వెంట్రుకలు పెరిగితే కత్తిరించుకో లేదా క్షురకుడి దగ్గరికెళ్లి క్షవరం చేయించుకో' అంటూ ఓ డాక్టర్ ఇచ్చిన సలహా విని గుండెలు పగిలేలా ఏడ్చాడు స్టీఫెన్​.

వైద్యుల నిర్లక్ష్యంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. వింత సమస్యకు పరిష్కారం తెలియక అయోమయంలో మునిగిపోయాడు.

ఇదీ చదవండి:పెళ్లి నుంచి పారిపోయిన వరుడు.. కారణమిదే!

ZCZC
PRI NAT NRG
.MUZAFFARNAGAR NRG7
UP-FARMER-SHOT
Farmer injured after assailants open fire in UP's Muzaffarnagar
          Muzaffarnagar (UP), Feb 7 (PTI) A 40-year-old farmer was shot by miscreants when he had gone to irrigate his fields at a village in Uttar Pradesh's Muzaffarnagar district, police said.
          Saleem suffered injuries due to the shooting on Thursday in Kishanpur village of Bhopa area and was later shifted to the district hospital where he is being treated, Bhopa station house officer M S Gill said.
          According to the police complaint, some unidentified miscreants came and opened fire at him.
          Police are searching for the assailants, the SHO said. PTI CORR
HDA
02071321
NNNN
Last Updated : Feb 29, 2020, 12:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.