కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన సుబహాని హజా మోయినుద్దీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరి, ఇరాక్‌లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు అతడిపై నేరం రుజువైంది. ఈ మేరకు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. రూ. 2,10,000 జరిమానా కూడా విధించినట్లు వెల్లడించారు.
2015 ఏప్రిల్‌లో మోయినుద్దీన్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అభియోగపత్రం దాఖలు చేసింది ఎన్ఐఏ. అదే ఏడాది ఏప్రిల్- సెప్టెంబరు నెలల మధ్య ఇరాక్‌లో పలు ఉగ్ర కార్యకలాపాలకు మోయినుద్దీన్ పాల్పడినట్లు పేర్కొంది. అనంతరం, 2016లో కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసుల సాయంతో తమిళనాడులో మోయినుద్దీన్‌ను అరెస్టు చేసింది ఎన్ఐఏ.
ఇదీ చూడండి: ఎన్కౌంటర్ చేయొద్దంటూ ప్లకార్డుతో లొంగిపోయిన గ్యాంగ్‌స్టర్