ETV Bharat / bharat

ఎన్​ఐఏ కోర్టు ముందుకు కేరళ బంగారు కి'లేడీ' - కేరళ గోల్డ్ స్మగ్లింగ్

దేశంలో సంచలనం సృష్టించిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో విచారణ వేగవంతం చేస్తోంది ఎన్​ఐఏ. కేసులో ప్రధాన నిందితులను ఎన్​ఐఏ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు అధికారులు. విచారణ నిమిత్తం 10 రోజుల రిమాండ్ కోరనున్నారు. మరోవైపు దుబాయ్​లో ఉన్న మూడో ప్రధాన నిందితుడు ఫాజిల్​ వాంగ్మూలాన్ని ఫోన్​ ద్వారా సేకరించారు అధికారులు.

Kerala gold smuggling case
కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు
author img

By

Published : Jul 13, 2020, 8:38 AM IST

Updated : Jul 13, 2020, 9:16 AM IST

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మూడో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫాజిల్ ఫరీద్ వాంగ్మూలాన్ని కస్టమ్స్ అధికారులు తీసుకున్నారు. ఇప్పటికీ దుబాయ్​లోనే ఉన్న ఫాజిల్​తో ఫోన్​లో సంభాషించి వివరాలు సేకరించారు.

మరో ఇద్దరు నిందితులు స్వప్న సురేశ్, సందీప్ నయ్యర్​కు కరోనా నెగటివ్ వచ్చిన నేపథ్యంలో సోమవారం ఎన్​ఐఏ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు అధికారులు. విచారణ నిమిత్తం 10 రోజుల రిమాండ్ కోరనున్నారు. ఈ మేరకు బెంగళూరు నుంచి కోచి ఎన్​ఐఏ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం..

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సరిత్​ను ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి నలుగురిపై చట్టవ్యతిరేక కార్యక్రమాలు, యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది ఎన్​ఐఏ. ఈ కేసు విచారణ కోసం కోచి డీసీపీ పూంగుళలి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు కేరళ డీజీపీ.

ఇదీ చూడండి: స్మగ్లింగ్​ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'

Last Updated : Jul 13, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.