ETV Bharat / bharat

'రేప్​ తర్వాత నిద్రపోయానంటే నమ్మాలా?' - కర్ణాటక హైకోర్టు తీర్పు

అత్యాచార కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగాక నిద్రపోయాయని బాధితురాలు చెప్పటం అర్థరహితమని అన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాల్లో భారతీయ మహిళలు ఇలా స్పందించరని వ్యాఖ్యానించారు. నిందితుడి బెయిల్​ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు.

Karnataka HC
అత్యాచార కేసు
author img

By

Published : Jun 25, 2020, 5:16 PM IST

Updated : Jun 25, 2020, 5:25 PM IST

ఓ అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు అలసిపోయి నిద్రపోయాయని చెప్పటం అర్థరహితమని అన్నారు. ఈ కేసులో నిందితుని ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారిస్తూ ఈ విధంగా స్పందించారు జస్టిస్ కృష్ణ దీక్షిత్.

"ఘటన జరిగిన తర్వాత కక్షిదారు అలసిపోయి పడుకున్నానని చెప్పారు. ఇది అర్ధరహితం. భారతీయ మహిళలు ఇలా వ్యవహరించరు. తమకు తీరని అన్యాయం జరిగినప్పుడు ఈ విధంగా స్పందించరు."

- జస్టిస్ కృష్ణ దీక్షిత్​

పెళ్లి పేరుతో దగ్గరై...

ఈ ఏడాది మే నెలలో తన దగ్గర పనిచేస్తున్న నిందితుడిపై అత్యాచారం కేసు పెట్టింది బాధితురాలు. అతనిపై సెక్షన్​ 376 (లైంగిక హింస), 420 (మోసం), 506 (బెదిరింపు) కేసులు నమోదు చేశారు.

ఎఫ్​ఐఆర్​ ప్రకారం.. బాధితురాలి వద్ద రెండేళ్లుగా నిందితుడు పనిచేస్తున్నాడు. అత్యాచారం జరిగిన రోజు ఆమెతో పాటు నిందితుడు కారులో కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఘటన జరిగింది. పెళ్లి పేరుతో బాధితురాలితో శారీరకంగా దగ్గరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

బెయిల్​ మంజూరు..

తొలుత నిందితుడు బెయిల్​ కోసం దరఖాస్తు చేయగా బెంగళూరు కోర్టు తిరస్కరించింది. తర్వాత హైకోర్టులో అప్పీలు చేశాడు. దీనిపై విచారించిన జస్టిస్ దీక్షిత్​.. ఘటనపై ఈ విధంగా స్పందించారు.

"రాత్రి 11 గంటల సమయంలో ఆఫీస్​కు వెళ్లాల్సిన పనేంటి? అతనితో కలిసి మద్యం సేవించేందుకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అతను కారులో ఎక్కుతున్నపుడు ఎందుకు అడ్డుకోలేదు? అత్యాచారం జరిగితే తెల్లారే వరకు ఎందుకు ఎదురుచూశారు? అప్పటివరకు నిందితుడిని అక్కడే ఎందుకు ఉండనిచ్చారు?" అని బాధితురాలిని ప్రశ్నిస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు జస్టిస్ దీక్షిత్.

తీవ్రత సరిపోదు..

బాధితురాలి తరఫున వాదించిన ప్రభుత్వ న్యాయవాది.. నిందితుడిపై ఉన్న ఆరోపణలు స్వాభావికంగా చాలా తీవ్రమైనవని కోర్టుకు తెలిపారు. అతడి నేరాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

అయితే తీవ్రత అనే ఒక్క అంశంతో పౌరుల స్వేచ్ఛను హరించలేమని జస్టిస్ దీక్షిత్​ వ్యాఖ్యానించారు.

Last Updated : Jun 25, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.