భారతీయ రైల్వే ఆదాయానికి కరోనా లాక్డౌన్ భారీగా గండి కొట్టిండి. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోవడం వల్ల.. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఆదాయంలో 90శాతం క్షీణించింది. మొత్తం మీద ఈ ఏడాది రూ. 3,322కోట్లు ఆర్జించినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు..
"ప్యాసింజర్ సెగ్మెంట్ ద్వారా రైల్వే రూ. 3,322కోట్లను సంపాదించింది. గతేడాదితో పోల్చితే ఇది 90శాతం తక్కువ. ప్యాసింజర్ రైళ్లను పుర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వలతో కలిసి పనిచేస్తున్నాం. కరోనా పరిస్థితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటాం. అయితే కచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేం."
--- వినోద్ కుమార్, రైల్వే బోర్డు ఛైర్మన్.
ప్రస్తుతం 736 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. వీటితో పాటు పండుగల సందర్భంగా అక్టోబర్ 20 నుంచి ఈ నెల 30 వరకు అదనంగా మరో 436 రైళ్లను నడుపుతోంది.
మరోవైపు సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం 9శాతం వృద్ధి చెందినట్టు వెల్లడించారు వినోద్. గతేడాదితో పోల్చితే ఇది రూ. 869కోట్లు ఎక్కువని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- 1.25 కోట్ల రైలు టికెట్లు రద్దు.. కారణమిదే?