ETV Bharat / bharat

భారత వ్యోమగాములకు అంతరిక్ష శిక్షణ షురూ - భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర

భారత వ్యోమగాములకు అంతరిక్ష శిక్షణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10న మొదలైన ఈ శిక్షణ 12 నెలల పాటు సాగనుంది. ఇస్రోతో కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యాలోని గగారిన్ రిసెర్చ్ అండ్ టెస్ట్​ కాస్మోనాట్ సెంటర్ ఇందుకు వేదికైంది.

spaceflight start training in Russia
అంతరిక్ష శిక్షణ
author img

By

Published : Feb 11, 2020, 11:20 AM IST

Updated : Feb 29, 2020, 11:18 PM IST

మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం నలుగురు భారత వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), గ్లావ్కోస్మోస్​ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి గగారిన్ రిసెర్చ్ అండ్ టెస్ట్​ కాస్మోనాట్ సెంటర్​(జీసీటీసీ)లో 12 నెలల శిక్షణ మొదలైంది.

సుయజ్ వాహక నౌక సహా II-76ఎండీకే ఎయిర్​క్రాఫ్ట్​ పనితీరుపై భారత వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో అసాధారణ ల్యాండింగ్ జరిగే సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి గ్లావ్కోస్మోస్​, ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్​ ఫ్లైట్​ సెంటర్​ మధ్య 2019 జూన్ 27న ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా అంతరిక్ష యాత్రకు అభ్యర్థుల ఎంపిక సహా వైద్య పరీక్షలు, శిక్షణ వంటి విషయాల్లో ఇస్రోకు గ్లావ్కోస్మోస్ సహకరించనుంది.

Last Updated : Feb 29, 2020, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.