ETV Bharat / bharat

దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు - Corona deaths in India latest news

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387‬పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,51,767కి చేరింది.

India crosses 1.5 lakhs covid-19 cases
దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : May 27, 2020, 9:22 AM IST

భారత్​లో కొవిడ్-19​ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,387 మంది వైరస్​ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్​-19 బాధితుల సంఖ్య లక్షా 50వేలు దాటింది.

India crosses 1.5 lakhs covid-19 cases
దేశ వ్యాప్తంగా కరోనా వివరాలు

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1792 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 54,758కి చేరింది. గుజరాత్​లో 915, మధ్యప్రదేశ్​లో 305 మంది కొవిడ్-19​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.