ETV Bharat / bharat

దేశ రక్షణే తొలి ప్రాధాన్యం- సైన్యానికి పూర్తి స్వేచ్ఛ: మోదీ

author img

By

Published : Jun 19, 2020, 5:01 PM IST

Updated : Jun 19, 2020, 9:52 PM IST

Following the violent face-off between Indian and Chinese troops in the Galwan valley, PM Modi has called for an all-party meeting today. The meeting is scheduled to be held at 5 pm via video conferencing.

MODI
మోదీ

21:10 June 19

  • #WATCH India wants peace and friendship, but upholding sovereignty is foremost: Prime Minister Narendra Modi at all-party meeting today on India-China border issue pic.twitter.com/xkw6sqBaJd

    — ANI (@ANI) June 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత భూభాగంలోకి చైనా బలగాలు చొరబడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అఖిలపక్ష భేటీలో మాట్లాడిన ఆయన.. భారత సైనిక బలగాలు దేశ రక్షణ కోసం సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్​ గల్వాన్ లోయ వద్ద కొత్తగా ఏర్పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా భద్రతా దళాల పెట్రోలింగ్ సామర్థ్యం పెరిగిందని ఆయన వెల్లడించారు.

భారత్​ పొరుగు దేశాలతో శాంతిని, స్నేహాన్ని కోరుకుంటుందన్న మోదీ... సార్వభౌమాధికారం విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

21:03 June 19

చైనా సంస్థలను భారత్​లోకి అనుమతించకూడదు: మమత

భారతదేశంలోకి... చైనాకు చెందిన టెలికాం, రైల్వే, ఏవియేషన్ సంస్థలను అనుమతించకూడదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆమె.. దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు.

20:22 June 19

సరిహద్దుల్లో చైనా ఆగడాలు హద్దుమీరుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ.. అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. దూరదృశ్య మాధ్యమంలో జరిగిన ఈ సమావేశంలో 20 పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ సహా 20 పార్టీల అధినేతలు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో దూరదృశ్య మాధ్యమంలో సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల దాడిలో అమరులైన భారత సైనికులకు సంతాపంగా అఖిలపక్ష నేతలు మౌనం పాటించారు. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలకు దారి తీసిన కారణాలు, సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్ధితులపై పార్టీల అధినేతలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌ వివరించారు.

అనంతరం.. భవిష్యత్‌ కార్యాచరణపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను తెలుసుకుంది ప్రభుత్వం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా పలువురు నేతలు అభిప్రాయాలు వినిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.     

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉన్న వేదికలను వినియోగించడంలో భారత్‌ విఫలమైంది. విలువైన సమయాన్ని వృథా చేశారు. దాని ఫలితంగానే 20 మంది జవాన్ల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవాధీన రేఖ వెంట యథాతథ స్ధితి పునరుద్ధరణ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని దేశం తెలుసుకోవాలని భావిస్తోంది. 

   -సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత్రి  

చైనా సరిహద్దుల వెంట సైనికులు ఆయుధాలు ధరించాలా వద్దా అన్నది అంతర్జాతీయ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ అన్నారు‌. వాటిని గౌరవించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్‌ సంఘీభావం ప్రకటించారు. చైనా విషయంలో కేంద్రం.... అమెరికా ఉచ్చులోకి వెళుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పేర్కొన్నారు. పంచశీల ఒప్పందాన్ని గౌరవించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ.రాజా అన్నారు.

19:32 June 19

మమతా అభిప్రాయం...

చైనాది ప్రజాస్వామ్యం కాదు. వారిది నియంతృత్వం. వారు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. మరోవైపు మనం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. భారత్​దే అంతిమ విజయం.. చైనా ఓడిపోక తప్పదు. ఐకమత్యంగా ఉందాం, ఆలోచిద్దాం. పనిచేద్దాం. ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఇస్తాం.  

   - మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

19:11 June 19

కాంగ్రెస్​ అభిప్రాయం...

అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల అగ్రనేతలు చైనాతో సరిహద్దు వివాదంపై తమ అభిప్రాయాలు తెలిపారు. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ భేటీ ఎప్పుడో జరిగి ఉండాల్సిందని.. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్​ వైపు నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.

17:45 June 19

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7684738_man.jpg
అఖిలపక్ష భేటీ

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చైనా ఆగడాలు హద్దు మీరుతున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో 20 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

గల్వాన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా దమనకాండలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో మోదీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో చైనాతో సంబంధాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గల్వాన్‌ ఘటన అనంతరం సరిహద్దులో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు చెప్పాలంటూ పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు వద్ద పరిస్థితులను కేంద్రం వివరించే అవకాశం ఉంది.

ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలు పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ప్రధాని తరఫున రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని ప్రధాన పార్టీలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

మరోవైపు, ఈ కీలక సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఆర్జేడీ వంటి పార్టీలను ఆహ్వానించకపోవడంపై వచ్చిన విమర్శలకు కేంద్రం వివరణ ఇచ్చింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ఉన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కిన పార్టీలను మాత్రమే సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

దీనిపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ దేశం, సైనిక బలగాల తరఫున నిలబడుతుందన్నారు. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. మరోవైపు, చైనాతో సైనిక ఒప్పందాలను సమీక్షించాలని ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ కేంద్రాన్ని కోరారు. 

17:09 June 19

చైనాతో గల్వాన్​ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగుతుంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు.

16:25 June 19

భారత్​- చైనా సరిహద్దు వివాదంపై అఖిలపక్ష భేటీ

ALL PARTY MEET
అఖిలపక్ష భేటీ

చైనాతో సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కాసేపట్లో జరగనుంది. సరిహద్దు వివాదంపై మేధోపరమైన చర్చకు, అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని భారత విధానాన్ని నిర్ణయించే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సరిహద్దు ఘర్షణలపై స్పందించాలని మోదీని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు డిమాండ్​ చేశారు. 

దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య సరిహద్దు వైరం మరింత ముదిరింది. తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా కవ్వింపు చర్యలు సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ దారితీసింది. ఇందులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. చైనా సైనికులూ 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Last Updated : Jun 19, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.