ETV Bharat / bharat

వలస కూలీలను ఆపడం సాధ్యం కాదు: సుప్రీం

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి, ప్రయాణ సౌకర్యాలు లేక స్వస్థలాలకు నడిచివెళ్తున్న వలసకూలీల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వారిని నడుచుకుంటూ వెళ్లకుండా ఆపలేమని స్పష్టం చేసింది. ఎవ‌రెలా వెళ్తున్నారో పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యమైన పని కాదని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించింది.

supreme court news
వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తామంటే ఎలా ఆపగలం: సుప్రీం
author img

By

Published : May 15, 2020, 5:58 PM IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు నడిచి వెళ్లకుండా ఆపడం సాధ్యకాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

పలు రాష్ట్రాలకు వలస వెళ్లి ఉపాధి కోల్పోయిన కూలీలను నడిచివెళ్లకుండా ఆయా ప్రాంతాల్లోని జిల్లా మెజిస్ట్రేట్​లు... వారిని గుర్తించి వసతి సహా పలు సౌకర్యాలు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇటీవలె 16 మంది కూలీలు రైలు ప్రమాదంలో చనిపోడానికి ప్రభుత్వం రవాణా భరోసా ఇవ్వకపోవడమే కారణమని అందులో పేర్కొన్నారు పిటిషనర్​.

పిటిషనర్​ వాదనను ప్రభుత్వం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తోసిపుచ్చారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను తరలించేందుకు రవాణా సదుపాయం ఏర్పాటు చేసినట్లు న్యాయస్థానానికి తెలిపారు. అయితే తమ వంతు వచ్చేవరకు వేచిచూడకుండా నడిచివెళ్తుంటే ఏం చేయగలమని కోర్టుకు విన్నవించారు.

సదుపాయాలపై నివేదిక ఇవ్వాలి..

వైద్యులు, మెడికల్​ సిబ్బందికి సరైన వసతులు కల్పించడం లేదని దాఖలైన పిటిషన్​పైనా సుప్రీం విచారణ చేపట్టింది. వైద్య సిబ్బందికి సరైన వసతులు లేని క్వారంటైన్​ భవనాలు ఇస్తున్నారని.. అవి కూడా ఆసుపత్రులకు దూరంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు​. నివాస సముదాయలవద్ద వైద్యుల కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొందరు అద్దెకు ఇళ్ల ఇవ్వడం లేదని, మరికొందరు ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొనేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు పిటిషనర్​ తరఫు న్యాయవాది.

దీనిపై స్పందించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా... స్టార్​ హోటళ్లు, గెస్ట్​హౌస్​లలో డాక్టర్లు, మెడికల్​ సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైద్య బృందాలపై దాడులకు పాల్పడినా, ఇబ్బందులు గురిచేసినా, వారి విధులకు ఆటంకం కలిగించినా, ఇళ్లు ఖాళీ చేయించడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్​ నాన్​ బెయిలబుల్ కేసులు పెడుతున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. పిటిషనర్​ అలాంటి ఘటనలు జరిగితే తమ దృష్టికి తేవాలని.. తగిన చర్యలు తీసుకుంటామని మెహతా కోరారు.

వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్​లైన్​ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కరోనా వారియర్స్​ భద్రతకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. విచారణ తదుపరి వారానికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం.. వైద్యలకు ఇచ్చిన క్వారంటైన్​ సౌకర్యాలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.