ETV Bharat / bharat

భారత్‌లో కరోనా ప్రబలితే.. ప్రమాదమే సుమా! - corona india

కొవిడ్‌-19 (కరోనా) మహమ్మారి చైనా నుంచి శరవేగంతో ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తీరు భారత్‌కూ అత్యంత అప్రమత్తత సంకేతాలను పంపుతోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతర్జాతీయ ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If Corona prevails in India .. It is an accident
భారత్‌లో ప్రబలితే.. ప్రమాదమే సుమా!
author img

By

Published : Feb 29, 2020, 9:01 AM IST

Updated : Mar 2, 2020, 10:36 PM IST

భారత్‌లో ప్రధానంగా అధిక జనసాంద్రత.. భారీగా అంతర్గత వలసలు.. బలహీన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ... పరిమిత వైద్య వసతులు... వంటి సవాళ్లున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ముప్పు ఉండొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇంతవరకు భారత్‌లో 3 కేసులే గుర్తించినా దేశవ్యాప్తంగా 23,500 మందికి పైగా పరిశీలనలో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. భారత్‌లో జనాభా (130 కోట్ల)తో పోలిస్తే గుర్తించిన కేసుల సంఖ్య లెక్కలోకి రానంత చిన్నదే అయినా చైనా లోపల కంటే బయట దేశాల్లో ఈ మహమ్మారి ఎక్కువగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన హెచ్చరికలు చేస్తోంది. ఆరోగ్య సరంక్షణకు సరైన నిధుల్లేని భారత్‌లో ఈ వ్యాధి విస్తరిస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలున్నాయి. ప్రస్తుతానికి అదుపు చేయగల పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఉన్న ఇతర అంటు వ్యాధులతో కలిపి ఈ వ్యాధి వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే.. ఊహించనంత వేగంగా విస్తరిస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జన సాంద్రతే సమస్య

చైనాలో ఒక చదరపు కిలో మీటరు ప్రాంతంలో 148 మంది నివసిస్తుంటే.. భారత్‌లో 420 మంది జీవనం సాగిస్తున్నారు. పారిశుద్ధ్య లోపంతో, కిక్కిరిసినట్లు ఉండే మురికివాడలూ ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఆరుగురు నగర వాసుల్లో ఒకరు మురికివాడల్లోనే ఉంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన ధారావీ (ముంబయి పరిధిలో) వంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇరుకిరుకు ప్రాంతాల్లో ఇళ్లుండటం వంటి కారణాలతో వ్యాధులు సులువుగా ప్రబలే అవకాశం ఉంటుంది. శ్వాస, స్పర్శ, మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం ద్వారా వైరస్‌ కారక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలెక్కువ. భారత్‌లో జనసాంద్రతే ఎక్కువ ఆందోళనకరమని.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తిని పరిశీలిస్తున్న అమెరికా నిఘా సంస్థలు కూడా చెబుతున్నాయి.

If Corona prevails in India .. It is an accident
భారత్‌లో ప్రబలితే.. ప్రమాదమే సుమా!

అత్యధికంగా వలసలు..

చైనాలో మాదిరిగా భారత్‌లోనూ అంతర్గత వలసల శాతం ఎక్కువే. దాదాపు 45 కోట్ల మంది ఉపాధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. ఎక్కువ మంది పల్లెల నుంచి పట్టణాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కడైనా వ్యాధి ప్రబలితే నియంత్రించడం కష్టమవుతుంది. చైనాలో అక్కడి ప్రభుత్వం వ్యాధి కేంద్రమైన హుబెయ్‌ ప్రావిన్సు మొత్తాన్ని దిగ్బంధనం చేసింది. భారత్‌లో అలాంటి పరిస్థితి దాదాపు అసాధ్యమే. జీడీపీలో కేవలం 3.7 శాతం మాత్రమే ఆరోగ్య సంరక్షణకు ఖర్చుచేసే భారత్‌లో కొవిడ్‌ వంటి వ్యాధులు ప్రబలితే ఆర్థిక రంగంపై మరింత భారం పడుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చులు భరించలేని ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

వేసవి.. ‘చల్లని’ కబురు!

భారత ఉపఖండంలో వేసవి ప్రారంభం కావడం ఒక రకంగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఎక్కువగా శీతల, పొడి వాతావరణాల్లో వ్యాప్తి చెందుతుందని.. దక్షిణాసియా దేశాల్లో ఎండలు పెరుగుతుండటంతో వేడి వాతావరణంలో వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డెంగీ, క్షయ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించిన అనుభవం కూడా భారత్‌కు కొంత మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ ప్రబలకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ తెలిపారు. విదేశాల్లోని దౌత్య కార్యాలయాలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దు ప్రాంతాల్లో వచ్చిపోయే ప్రయాణికులను అధికార వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. కేరళలో నమోదైన 3 కేసులకు సంబంధించిన వ్యక్తులను కూడా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

వచ్చేనెలలో సైప్రస్‌లో జరిగే షూటింగ్‌ వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌ వైదొలగింది.

Last Updated : Mar 2, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.