ETV Bharat / bharat

కరోనా పరీక్షలకు ఇక కొత్త పద్ధతి- అరగంటలో రిజల్ట్ - Coronavirus

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ నిర్ధరణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హాట్​స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్ స్పష్టం చేసింది.

ICMR recommends antibody test for speedy detection of COVID-19 cases
'హాట్​స్పాట్లలో యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించండి'
author img

By

Published : Apr 3, 2020, 12:22 PM IST

Updated : Apr 3, 2020, 12:27 PM IST

దేశంలో కరోనా వైరస్​ కేసులను వేగంగా గుర్తించేందుకు.. యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించింది భారతీయ వైద్య పరిశోధన మండలి​(ఐసీఎం​ఆర్​). కొవిడ్​-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్​ ఫోర్స్​ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్​స్పాట్​ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్​ను నిర్ధరించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​.

" హాట్​స్పాట్​ ప్రాంతాల్లోని స్థానికులను రాపిడ్​ యాంటీబాడీ టెస్ట్​ ద్వారా పరీక్షించొచ్చు. యాంటీబాడీ పరీక్షలో పాజిటివ్​గా వచ్చినవారి గొంతు, ముక్కు నమూనాలు సేకరించి రివర్స్​ ట్రాన్స్​క్రిప్షన్​-పాలీమరేజ్​ చైన్​ రియాక్షన్​తో (ఆర్టీ-పీసీఆర్)​ నిర్ధరించాలి. నెగటివ్​ వచ్చినవారిని హోం క్వారంటైన్​ చేయాలి."

- ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​

ప్రస్తుతం కరోనా వైరస్​ సోకిందా లేదా అని నిర్ధరించేందుకు గొంతు, ముక్కు నుంచి సాంపిల్స్ సేకరించి పీసీఆర్​ పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. కానీ ఫలితం వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. యాంటీబాడీ పరీక్షలు ఇతర రక్త పరీక్షల తరహాలోనే ఉంటాయి. 15-30 నిమిషాల్లోనే ఫలితాలొస్తాయి. ఈ తరహా విధానాన్ని మహారాష్ట్రలో అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది.

ఇదీ చూడండి : కరోనాపై యుద్ధానికి మహారాష్ట్ర కొత్త 'రాపిడ్' స్కెచ్

Last Updated : Apr 3, 2020, 12:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.