ETV Bharat / bharat

కరోనా నుంచి కోలుకున్నాక ఇలా చేయాల్సిందే! - కరోనా వైరస్ జాగ్రత్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొంతమంది మాత్రం ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు వైద్యులు. వ్యాయామం, యోగా ద్వారా వైరస్​ ప్రభావానికి గురైన ఊపిరితిత్తుల పనితీరుతో పాటు ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

corona
కరోనా
author img

By

Published : Apr 8, 2020, 10:13 AM IST

కరోనా.. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే వైరస్. ఈ మహమ్మారి ఊపిరితిత్తుల కణాలపై దాడి చేసి నాశనం చేయడం వల్ల వ్యాధిగ్రస్తుడికి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వైరస్ సోకిన వాళ్లలో చాలా మంది తేలికపాటి లక్షణాలతో బాధపడి తిరిగి కోలుకుంటున్నారు. మరి వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుందా? ఆరోగ్యం మునుపటిలా ఉండదా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం చాలా మంది మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు వైద్య నిపుణులు. కోరనా నుంచి కోలుకున్న వ్యక్తులు రన్నింగ్​, జాగింగ్​, వాకింగ్​ చేసినా.. ఆరోగ్య సమస్యలబారిన పడే అవకాశముందని చెబుతున్నారు. అయితే పలు వ్యాయామాల ద్వారా ఈ సమస్యల్ని అధిగమించొచ్చని వెల్లడించారు దిల్లీ శాలిమార్ బాగ్ ఆసుపత్రి వైద్యులు వికాస్ మౌర్య.

"ఇది నావెల్ వైరస్. ఎంతకాలం ప్రభావం చూపిస్తుందో తెలియదు. కానీ శ్వాసకోశ ఇబ్బందులు తెచ్చే హెచ్1ఎన్1 వైరస్​ను పరిశీలించి కొన్ని అంచనాలు వేయొచ్చు. ఒక వ్యక్తి వ్యాధి తీవ్రతను బట్టి ఈ ప్రభావం కొన్ని వారాలు, లేదా నెలలు, సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది.

అయితే క్రమంగా వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. శ్వాసకోశ సమస్యలు నుంచి బయటపడేందుకు యోగా మంచి సాధనం. ముఖ్యంగా శ్వాస సంబంధిత యోగాసనాలు ఇందుకు దోహదం చేస్తాయి."

- డాక్టర్ వికాస్ మౌర్య, శాలిమార్ బాగ్ ఆసుపత్రి

మళ్లీ ఇన్ఫెక్షన్?

కరోనా బారిన పడినవారిలో అధికశాతం మంది సాధారణంగానే ఉండి.. పూర్తిగా కోలుకున్నారు. ఫైబ్రోసిస్ దశకు చేరుకున్నవారిలో మాత్రం దీర్ఘకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఖన్నా తెలిపారు. పోషకాహారం, శ్వాస సంబంధమైన వ్యాయామాల ద్వారా కోలుకున్నవారు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సలహా ఇచ్చారు.

"వైద్యులు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. కొన్ని కేసుల్లో మాత్రం మళ్లీ ఇన్ఫెక్షన్​కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు చేతులు శుభ్రం చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం అత్యవసరం. "

- పునీత్ ఖన్నా, మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

దశల ఆధారంగా..

అయితే వ్యాధిగ్రస్తుడిపై కరోనా వైరస్ ప్రభావ తీవ్రతను బట్టి ఉపిరితిత్తుల పనితీరు ఉంటుందన్నారు శ్రీబాలాజీ వైద్య సంస్థలోని డాక్టర్ జ్ఞాన్ దీప్ మంగళ్.

"శ్వాసకోశ ఇబ్బందులతో వెంటిలేటర్ పై ఉన్నవారికి ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వైరస్ వ్యాధిగ్రస్తుడిపై చూపించిన ప్రభావం ఆధారంగా అతని ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. కోలుకున్న తర్వాత వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు అతని ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి."

- డాక్టర్ జ్ఞాన్ దీప్ మంగళ్, శ్రీ బాలాజీ వైద్య సంస్థ

వీళ్లలో లేదు

అయితే చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో చేసిన అధ్యయనాల ప్రకారం కోలుకున్నవారిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తలేదన్నారు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు పునీత్ ఖన్నా. తీవ్రమైన న్యూమోనియా బారిన పడినవారిలో 20 శాతం మందికి మాత్రమే కొంతకాలం తేలికపాటి ఫైబ్రోసిస్ గమనించినట్లు తెలిసిందన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.