ETV Bharat / bharat

'ఎస్పీ బాలు స్వరం అజరామరం' - ఎస్పీ బాలు మృతి

సంగీత సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఆయన స్వరంతో అలరించారని కీర్తించారు.

PM on Balasubrahmanyam's death
'ఆయన స్వరం ఎప్పటికీ బతికే ఉంటుంది'
author img

By

Published : Sep 25, 2020, 4:46 PM IST

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణవార్త సంగీత ప్రపంచంతో పాటు అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

melodious voice
రాష్ట్రపతి ట్వీట్

"దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో భారత సంగీతం ఓ మధుర స్వరాన్ని కోల్పోయింది. ఆయనను ఓ గాన చంద్రుడిగా అభిమానులు పిలుస్తారు. పద్మభూషణ్​ సహా ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయన కుటుంబం, సన్నిహితులు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను."

- రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

melodious voice
మోదీ ట్వీట్

"శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం కళా ప్రపంచానికి తీరని లోటు. ప్రతి ఇంట్లో మార్మోగిన ఆయన గళం దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

melodious voice
అమిత్ షా ట్వీట్

"పద్మ భూషణ్​ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త తీవ్రంగా బాధించింది. ఆయన మధుర గాత్రం, సంగీతంతో ఎప్పుడూ మన జ్ఞాపకాల్లో బతికే ఉంటారు. ఆయన సన్నిహితులకు నా సంతాపం. ఓం శాంతి."

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

melodious voice
రాహుల్ గాంధీ ట్వీట్

"ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన వివిధ బాషల్లో పాడిన పాటలు ఎన్నో కోట్ల మంది హృదయాల్ని తాకాయి. ఆయన స్వరం ఎప్పటికీ బతికే ఉంటుంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

వీరితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఎస్పీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.