భారత్‌లో కరోనా కారణంగా ఒక్కరోజు వ్యవధిలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 149మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 5,194మందికి వైరస్ సోకింది. 402 మందికి వ్యాధి నయమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. 80 శాతం వైరస్ కేసులు అతిస్వల్ప తీవ్రత ఉన్నవేనని నివేదించింది.
మానవ వనరుల కోసం..
వైరస్‌పై పోరాడేందుకు పెద్దమొత్తంలో సిబ్బంది అవసరమవుతారని వెల్లడించింది ఆరోగ్య శాఖ. మానవ వనరులను అందుబాటులో ఉంచే దిశగా దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పింది. వైరస్‌కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారత్‌లో సరిపోయినన్ని ఉన్నట్లు పేర్కొంది.
కాంటాక్ట్ ట్రేసింగ్‌పై
కరోనా కేసులకు అవసరమైనన్ని ఆసుపత్రులను కేటాయించాలని రాష్ట్రాలకు సూచించింది ఆరోగ్య శాఖ. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ముమ్మరం చేయాలని నిర్దేశించింది.
లక్షకు పైగా పరీక్షలు
139 ప్రభుత్వ ల్యాబ్‌లు, 65 ప్రైవేటు ల్యాబ్‌ల ద్వారా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్). ఇప్పటివరకు దేశంలో 1,21, 271 వైరస్ పరీక్షలు చేశామని తెలిపింది. ల్యాబ్‌ల సమర్థతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: సీఎంలతో శనివారం మోదీ భేటీ- లాక్‌డౌన్‌పై నిర్ణయం!