ETV Bharat / bharat

అర్ణబ్​ గోస్వామికి హైకోర్టులో చుక్కెదురు

రిపబ్లిక్‌ టీవీ ఛానల్‌ ప్రధాన సంపాదకుడు అర్ణబ్​ గోస్వామి దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, బెయిల్‌ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

Arnab
అర్ణబ్​ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురు
author img

By

Published : Nov 9, 2020, 5:30 PM IST

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్‌ పోలీసులు నవంబర్‌ 4న అరెస్టు చేశారు.

అరెస్టు అక్రమమని పేర్కొంటూ అర్ణబ్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా శుక్రవారం ఆయనకు బెయిల్‌ లభించలేదు. మధ్యంతర బెయిల్‌పై శనివారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది. తాజాగా విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.

బెయిల్‌ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును హైకోర్టు కల్పించడం వల్ల ఆయన అలీబాగ్‌లోని సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం లోపు విచారణ జరపాలని బాంబే హైకోర్టు.. సెషన్స్‌ కోర్టును ఆదేశించింది.

అర్ణబ్‌ను తొలుత జైలు క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. అయితే, జ్యుడిషియల్‌ కస్టడీలో ఆయన మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు సమాచారం రావడం వల్ల ఆదివారం తలోజా జైలుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.