ETV Bharat / bharat

ఆ ఉపాధ్యాయుల నుంచి 13 కోట్లు వసూలు! - ఉత్తర్​ ప్రదేశ్​ వార్తలు

అక్రమంగా ఉపాధ్యాయ వృత్తిలో కొలువు సాధించి, అనర్హతకు గురైన నకిలీ టీచర్లపై దర్యాప్తు చేపట్టిన యూపీ ప్రభుత్వం.. వారి నుంచి రూ.13 కోట్ల రూపాయలను వసూలు చేయనుంది. గతంలో సస్పెండ్​ అయిన 51మంది నకిలీ ఉపాధ్యాయుల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టనున్నట్లు తెలిపారు అధికారులు.

UP Fake teachers
ఆ ఉపాధ్యాయుల నుంచి 13 కోట్లు వసూలు!
author img

By

Published : Jul 4, 2020, 8:15 PM IST

తప్పుడు మార్గాల ద్వారా గౌరవప్రదమైన ఉపాధ్యాయ కొలువు సంపాదించి సస్పెండైన నకిలీ టీచర్లపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గోరఖ్​పూర్​ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో.. 51మంది ఉపాధ్యాయుల నుంచి రూ.13 కోట్లు వసూలు చేయనుంది యూపీ సర్కార్​.

విధుల నుంచి బహిష్కరించిన 51మంది ఉపాధ్యాయుల్లో 39మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు అధికారులు. సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) సహా.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు టీమ్​ను ఏర్పాటు చేశారు.

ఏం జరిగిందంటే...

గత కొన్నేళ్లుగా చాలా మంది నకిలీ ఉపాధ్యాయులు.. మోసపూరితంగా జీతాలు తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో గోరఖ్​పూర్​ ప్రాథమిక పాఠశాల విద్యాధికారి(బీఎస్​ఏ) భూపేంద్ర నారాయణ్​ సింగ్​ దర్యాప్తు చేపట్టారు. సమగ్ర వివరాలు ఆరా తీసిన భూపేంద్ర.. 51 మంది ఉపాధ్యాయులను సస్పెండ్​ చేశారు.

ఇదీ చదవండి: 'భారత సంస్కృతిని జగతికి చాటిన మహనీయుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.