కర్ణాటక ప్రభుత్వం 108 అడుగుల ఎత్తైన కెంపెగౌడ విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
"బెంగళూరు నగరం గార్డెన్ సిటీ, సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. నగరానికి కొత్త హంగులు తీర్చిదిద్ది.. మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలి. హౌజింగ్, వైద్యం, ట్రాఫిక్ నిర్వహణ, కాలుష్య నియంత్రణపై దృష్టిసారించాలి. నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టింది."
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
నగరంలో శాశ్వత నదులు ఏవీ లేకపోయినా.. కెంపెగౌడ ముందుచూపుతో వందలాది సరస్సులను నిర్మించాలని గుర్తు చేశారు యడియూరప్ప. నగరంలో ఉన్న ధర్మంబూధి, సాంపనిరం, హళసురు సరస్సులు ఆయన దీర్ఘదృష్టికి తార్కాణాలని కొనియాడారు. ఇవన్నీ ప్రజలకు కెంపెగౌడ ఇచ్చిన గొప్ప బహుమతులని పేర్కొన్నారు.
రూ.66 కోట్లు
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.66 కోట్ల నిధులు కేటాయించారు. ఏడాదిన్నర వ్యవధిలో విగ్రహం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎవరీ కెంపెగౌడ?
విజయనగర సామ్రాజ్యంలో కెంపెగౌడ ఓ సేనాపతి. 550 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరాన్ని కెంపెగౌడ స్థాపించారు.
ఇదీ చదవండి- కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం