ETV Bharat / bharat

భారీ అగ్నిప్రమాదం- 60 గుడిసెలు దగ్ధం!

ఉత్తర్​ప్రదేశ్ ఏశ్​బాగ్​లోని దోబీఘాట్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. 50-60 గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు అదుపుచేసినట్లు వెల్లడించారు.

fire-breaks-out-at-dhobi-ghat-in-lucknow
యూపీలో అగ్నిప్రమాదం- ఘటనాస్థలిలో 60 గుడిసెలు
author img

By

Published : Oct 12, 2020, 11:02 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో అగ్నిప్రమాదం జరిగింది. ఏశ్​బాగ్​ ప్రాంతంలోని దోబీఘాట్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు వెంటనే మంటలను ఆర్పివేశాయి.

యూపీలో అగ్నిప్రమాదం- 60 గుడిసెలు దగ్ధం!

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో 50-60 గుడిసెలు ఉన్నాయని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

"అర్ధరాత్రి 1.30 గంటలకు అగ్నిప్రమాద సమాచారం అందింది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశాం. ఇక్కడ 50-60 గుడిసెలు ఉన్నాయి. గాయాలు, ఆచూకీ కోల్పోయిన వారి సమాచారంపై స్పష్టత లేదు."

- విజయ్ కుమార్ సింగ్, చీఫ్ ఫైర్ ఆఫీసర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.