ETV Bharat / bharat

టోల్​గేట్​ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి! - Arjunan abuses cops

తమిళనాడు సేలం జిల్లాలో పాస్​ అడిగినందుకు పోలీసులతో గొడవ పెట్టుకుని, దాడి చేశారు ఏఐఏడీఎంకే నేత, మాజీ ఎంపీ. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో జిల్లాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈ-పాస్​లు ఉంటేనే అనుమతిస్తున్నారు.

ex MP arjunan
టోల్​గేట్​ వద్ద మాజీ ఎంపీ వీరంగం
author img

By

Published : Jun 29, 2020, 11:46 AM IST

విధి నిర్వహణలో భాగంగా పాస్ అడిగినందుకు.. పోలీసులతో గొడవకు దిగారు ఓ మాజీ ఎంపీ. నన్నే పాస్​ అడుగుతావా అంటూ దాడి చేశారు. అంతే కాదు, కాలుతో తన్నేందుకు వెనుకాడలేదు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సమీలంలోని ఓమల్​పుర్​ టోల్​గేట్​ వద్ద జరిగింది.

టోల్​గేట్​ వద్ద మాజీ ఎంపీ వీరంగం

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అధికారులు. లాక్​డౌన్​ నిబంధనల మేరకు ఈ-పాస్​లు ఉంటేనే నగరంలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో సేలం నగరంలోకి వచ్చే వారిని ఓమల్​పుర్ టోల్​గేట్​​ వద్ద తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఓమల్​పుర్​ నుంచి సేలం నగరంలోకి వస్తోన్న ఏఐఏడీఏంకే సభ్యుడు, మాజీ ఎంపీ అర్జునన్​ కారును అడ్డుకున్నారు పోలీసులు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ-పాస్​, గుర్తింపు కార్డు చూపించాలని కోరారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ ఎంపీ అర్జునన్​ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసభ్యపదజాలంతో దూషించి.. కాలుతో తన్నారు.

ex MP arjunan
టోల్​గేట్​ వద్ద మాజీ ఎంపీ వీరంగం

అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి. అయితే.. విధుల్లో ఉన్న పోలీసులతో గొడవకు దిగినప్పటికీ.. ఆ నాయకుడిపై ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవటం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.