జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఖుల్చోహార్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరి నుంచి ఓ ఏకె రైఫిల్, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముష్కరులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఖుల్చోహార్ ప్రాంతంలో ముష్కర మూకలు నక్కి ఉన్నాయన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు తీవ్రవాదులు. అది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.