కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. గిరిజనులను కాల్చి చంపేలా మోదీ ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని రూపొందిస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 గంటల్లోగా నోటీసులపై కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించాలని కోరింది. అలా జరగని పక్షంలో రాహుల్కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తదుపరి కార్యచరణలుంటాయని ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : ఐరాస నిర్ణయాన్ని స్వాగతించిన ప్రపంచదేశాలు