ETV Bharat / bharat

డోభాల్​ చాకచక్యంతోనే చైనా వెనక్కు తగ్గిందా? - భారత చైనా కాల్పులు

భారత్- చైనా సరిహద్దు వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. చైనా విదేశాంగ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ సంభాషణ అనంతరం ఆ దేశం వెనక్కు తగ్గింది. సరిహద్దు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు అంగీకరించింది.

Doval
డోభాల్
author img

By

Published : Jul 7, 2020, 5:03 AM IST

భారత్‌తో ఢీ అంటే ఢీ అన్న చైనా ఒక్కసారిగా వెనక్కుతగ్గింది. తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో తమ బలగాలను 2 కి.మీ వరకు ఉపహంసరించుకుంది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా వెనకడుగు వేయని చైనాపై భారత్ ఏ విధంగా ఒత్తిడి పెంచింది అంటే సమాధానం ఒక్కటే.. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటలపాటు డోభాల్​ ఆదివారం ఫోన్​‌లో సంభాషించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగినట్లు వెల్లడించాయి. ఈ మేరకు ఇరుదేశాలు వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) గౌరవిస్తూ, గమనిస్తుండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలానే వాస్తవ పరిస్థితులను మార్చేందుకు ఏ దేశం ఏకపక్ష చర్యలకు ఉపక్రమించకూడదని అంగీకారం జరిగినట్లు సమాచారం.

డోభాల్ ఒత్తిడితోనే..!

ఎల్‌ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను వీలైనంత త్వరగా అక్కడ నుంచి ఉపసంహరించుకునేందుకు డోభాల్​ ఒత్తిడితో చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసి పనిచేసేందుకు నిర్ణయం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించారు. శాంతి పునరుద్ధరణ కోసం ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను పూర్తిస్థాయిలో సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు."

- విదేశాంగ శాఖ ప్రకటన

మోదీ ప్రధాని అయ్యాక అజిత్‌ డోభాల్​ను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. తన దౌత్య నీతితో అనేక సమస్యలను సమర్థంగా పరిష్కరించారు. మయన్మార్​లో తీవ్రవాదులపై మెరుపుదాడులు, పాక్​లో లక్షిత దాడుల్లో డోభాల్ కీలక పాత్ర పోషించారు. డోక్లామ్ వివాద సమయంలోనూ చైనాతో చర్చలు జరిపారు. తాజా చర్చలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

ధ్రువీకరించిన చైనా..

గల్వాన్ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. జూన్‌ 30న జరిగిన కమాండర్‌ స్థాయి చర్చల్లో ఇరు దేశాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనుతిరిగాయని భారత సైనిక వర్గాల పేర్కొన్న కొన్ని గంటల్లోనే చైనా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

"జూన్‌ 30న భారత్‌-చైనా సైనిక వర్గాలు కమాండర్‌ స్థాయిలో చర్చలు జరిపాయి. అంతకుముందు జరిగిన రెండు దఫాల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాం. ఉభయ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించాం. సైనిక, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకునేందుకు భారత్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం."

ఝావో లిజియాన్‌, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: 'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.