ETV Bharat / bharat

చైనాకు రామ్​నాథ్​ పరోక్ష హెచ్చరికలు

సరిహద్దులో దుస్సాహసాలకు పాల్పడుతున్న చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. హద్దు మీరి ప్రవర్తించిన వారికి దీటైన జవాబివ్వడంలో భారత్​ ఏమాత్రం వెనుకడుగు వేయదని స్పష్టంచేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి... మరికొన్ని కీలకాంశాలపై మాట్లాడారు.

ramnath kovind
ప్రకృతితో అనుసంధానమై జీవిచటం నేర్చుకోవాలి: రాష్ట్రపతి
author img

By

Published : Aug 14, 2020, 7:48 PM IST

Updated : Aug 14, 2020, 8:42 PM IST

భారత్​-చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ డ్రాగన్​కు పరోక్ష హెచ్చరికలు చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. భారత్​ శాంతి మంత్రాన్నే నమ్ముకున్నా.. దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తే దీటైన సమాధానం చెప్పగలదని స్పష్టం చేశారు. కొన్ని సరిహద్దు దేశాలు విస్తరణవాదంతో దుస్సాహసానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. చైనా పేరు ప్రస్తావించకుండానే గట్టి హెచ్చరికలు పంపారు.

" కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం పోరాడుతుంటే.. కొందరు మన పోరుగువాళ్లు విస్తరణవాదంతో దుస్సాహసానికి పాల్పడుతున్నారు. గల్వాన్​ లోయలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నా సెల్యూట్​. దేశం కోసం మరణించిన వారు నిజమైన భరతమాత ముద్దుబిడ్డలు. దేశం మొత్తం వారికి సెల్యూట్​ చేస్తోంది. ప్రతి భారతీయుడు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సరిహద్దు పోరాటంలో వారి ధైర్యం, మేము శాంతిని కోరుకుంటున్నాం. దుస్సాహసాలకు తగిన సమాధానం ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉన్నాం. సరిహద్దులను రక్షించే సాయుధ దళాలు, పారా మిలటరీ, పోలీసు సిబ్బంది పట్ల గర్వంగా ఉంది.

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని ప్రశంసించారు రాష్ట్రపతి. విదేశీ పెట్టుబడిదారుల భయాలు తగ్గిస్తూ.. ఆత్మనిర్భర్​ భారత్​ అంటే ప్రపంచాన్నిదూరం చేయకుండా స్వయం సమృద్ధిగా ఉండటమేనని నొక్కిచెప్పారు.

రామాలయ నిర్మాణం...

అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నిర్మాణం దేశప్రజలందరికి గర్వకారణని పేర్కొన్నారు రాష్ట్రపతి. దేశ ప్రజలు చాలా కాలం పాటు సహనంతో న్యాయ వ్యవస్థపై అలుపెరుగని నమ్మకాన్ని ఉంచారని.. చివరకు రామ జన్మభూమి సమస్య న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కారమైందని గుర్తు చేశారు. అయోధ్యపై సుప్రీం తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారన్నారు.

ప్రకృతితో అనుసంధానమై జీవించటం నేర్చుకోవాలి..

ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోందని.. ప్రతిఒక్కరు ప్రకృతితో మమేకమై జీవించటం నేర్చుకోవాలని సూచించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కరోనాపై పోరులో సేవలందిస్తున్న యోధులకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వారి విధుల పరిధిని దాటి సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా వల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.

ఇదీ చూడండి: గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

Last Updated : Aug 14, 2020, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.