ETV Bharat / bharat

మరో వారం పాటు నైరుతి రుతుపవనాల ప్రభావం: ఐఎండీ - నైరుతి రుతిపవనాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడేందుకు మరికొంత సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎం​డీ) అంచనా వేసింది. మరో వారం వరకు రుతుపవనాలు కొనసాగవచ్చని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనం బలపడి ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Depression over Bay of Bengal delays withdrawal of monsoon: IMD
వెనక్కి వెళ్లనంటున్న నైరుతి రుతుపవనాలు!
author img

By

Published : Oct 11, 2020, 8:32 PM IST

వచ్చే వారం వరకు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెనుదిరిగే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎం​డీ) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని పేర్కొంది. ఫలితంగా దేశంలో వర్షాకాలం మరికొన్ని రోజులు కొనసాగనుందని పేర్కొంది.

ఉత్తరాంధ్రలో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని ఐఎం​డీ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్​తో పాటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఒడిశాలో 13న వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

దేశంలో జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 30వరకు వర్షాకాలంగా గుర్తిస్తారు. వరుసగా రెండో ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది.

రుతుపవనాలు ఇప్పటికే.. ఉత్తర భారతంతో పాటు గుజరాత్​, మధ్యప్రదేశ్​ నుంచి వెనుదిరిగాయి. కానీ దేశాన్ని పూర్తిగా వీడేందుకు మరికొంత సమయం పడుతుందని ఐఎం​డీ పేర్కొంది.

ఇదీ చూడండి:- మద్యం తాగితే మరింత వేగంగా కరోనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.