ETV Bharat / bharat

ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!

మేఘాలయలోని లామిన్​ గ్రామంలో గత నెల పుట్టగొడుగులు తిని ఆరుగురు మరణించారు. మరో 18మంది ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా వీటిని .. విషపూరిత అమనిత ఫల్లాయిడెస్​​ రకం పుట్టగొడుగులుగా గుర్తించారు.

'Death Cap' mushrooms behind death of six in Meghalaya
ఆ ఆరుగురు మృతికి పుట్టగొడుగులే కారణం!
author img

By

Published : May 9, 2020, 2:00 PM IST

మేఘాలయలోని పశ్చిమ జైన్​తియా హిల్స్​ జిల్లాలో ఆరుగురి మరణానికి కారణమైన విషపూరిత పుట్టగొడుగులను.. అమనిత ఫల్లాయిడెస్​ ​గా గుర్తించారు. వీటిని 'డెత్​ క్యాప్​' అని కూడా పిలుస్తారని ఓ సినియర్​ అధికారి తెలిపారు.

పుట్టగొడుల వల్లే...

ఇండో-బంగ్లాదేశ్​ సరిహద్దులో ఉన్న అమ్లరెమ్​ ప్రాంతంలోని లామిన్​ గ్రామంలో గత నెల.. పుట్టగొడుగులు తిని ఆరుగురు మరణించారు. వీరిలో 14ఏళ్ల బాలిక కూడా ఉంది. సమీప అడవుల నుంచి ఈ పుట్టగొడుగులను సేకరించారు.

ఈ ఘటనలో మూడు కుటుంబాలకు చెందిన 18మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వాంతులు, తలనొప్పి, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలను గుర్తించారు వైద్యులు. వీరిలో ముగ్గురు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.

దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆ పుట్టగొడుగులు విషపూరితమైన అమనిత ఫల్లాయిడెస్​​ అని నిర్ధరించారు. అవి తింటే మనిషి కాలేయం దెబ్బతింటుంది. అయితే ఈ రకం పుట్టగొడుగులు తిన్న ప్రతి ఒక్కరూ మరణించరని వైద్యులు స్పష్టం చేశారు. వారు ఎంత మొత్తంలో దీన్ని తిన్నారనేదానిపై మరణం అధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- భర్త కోసం 'లింగ' దీక్ష స్వీకరించిన ముస్లిం యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.