ETV Bharat / bharat

భర్త కోసం 'లింగ' దీక్ష స్వీకరించిన ముస్లిం యువతి - లింగాయత్

హిందువులు ఇతర మతాల్లో చేరిన సంఘటనలు పలు సందర్భాల్లో చూశాం. అయితే.. కర్ణాటక బెళగావి జిల్లాలో ఓ ముస్లిం యువతి లింగ దీక్ష స్వీకరించి లింగాయత్​లో చేరింది. ముస్లిం యువతి హిందూ సమాజంలోకి రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

Linga Deeksha in
భర్త కోసం 'లింగ' దీక్ష స్వీకరించిన ముస్లిం యువతి
author img

By

Published : May 9, 2020, 6:18 AM IST

Updated : May 9, 2020, 8:00 AM IST

కర్ణాటక బెళగావి జిల్లాలో ఓ ముస్లిం యువతి లింగాయత్​ సంప్రదాయం ప్రకారం లింగ దీక్ష స్వీకరించింది. హిందూ యువకుడిని వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఆ యువతి.

Linga Deeksha
లింగ దీక్ష స్వీకరించిన ముస్లిం యువతి

ఇదీ జరిగింది..

బెళగావి జిల్లా కుబ్బర గ్రామానికి చెందిన మహేశ్​ కుర్బెటా అనే హిందూ యువకుడు.. అరాబియా మకందర్​ అనే ముస్లిం అమ్మాయిని నెలరోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆమె లింగ దీక్ష తీసుకోలేదనే కారణంతో వరుడి తల్లిదండ్రులు ఇంట్లోకి రావటానికి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో గ్రామంలోని విరక్ట మఠంలో శివబసవ స్వామీజీని కలిసి లింగ దీక్ష ఇవ్వాలని కోరింది ఆ యువతి. అన్ని రకాలుగా చర్చించిన మఠాదీసులు.. చివరకు ఆ యువతికి లింగ దీక్ష ఇచ్చేందుకు అంగీకరించారు.

ఈ మేరకు భర్తతో కలిసి గురువారం మఠానికి వెళ్లి.. శివబసవ స్వామీజీ ఆధ్వర్యంలో లింగ దీక్ష స్వీకరించింది ఆ ముస్లిం యువతి. లింగాయత్​లో చేరినందున ఆ యువతి పేరును సుస్మితగా మార్చారు.

Last Updated : May 9, 2020, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.