ETV Bharat / bharat

సూపర్ సైక్లోన్​గా 'అంపన్'​.. తీర ప్రాంతాలపై ప్రభావం

'అంపాన్'​ తుపాను సోమవారం సూపర్​ సైక్లోన్​గా మారింది. బుధవారం 196 కి.మీ వేగంతో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో బంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Cyclone 'Amphan' may cause extensive damage on Bengal coast during landfall: Govt
సూపర్ సైక్లోన్​గా 'అంపాన్'​.. తీర ప్రాంతాలపై ప్రభావం
author img

By

Published : May 19, 2020, 5:01 AM IST

బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అంపన్'​ సోమవారం సూపర్​ సైక్లోన్​గా మారింది. ఈ క్రమంలోనే బుధవారం తీరం దాటినప్పుడు బంగాల్​లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 196 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో.. తుపాను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించింది. అంపన్​ కారణంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఒడిశాలోని కొన్ని తీర ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది . అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడనున్నట్లు తెలిపింది. ఫలితంగా మే 20 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ప్రధాని సమీక్ష...

ఇప్పటికే 'అంపన్'​ తుపాను తీవ్రత, ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. తీర ప్రాంతాల్లో నివాముంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో బంగ్లాదేశ్​, ఒడిశా రాష్ట్రాల్లో 25 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి.

ఏం జరిగినా సిద్ధం...

తీరప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత తెలిపారు. అంపాన్​ తుపాను వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.