ETV Bharat / bharat

నగరవాసుల చింత అంతా కరోనా గురించే! - కరోనా వైరస్​ ఇండియా

ఇప్​సోస్​ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 'వాట్​ వర్రీస్​ ద వరల్డ్​' అనే సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న భారత నగరవాసుల్లో అత్యధిక(62శాతం) మంది కరోనా గురించే ఆందోళన చెందుతున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయి.

COVID-19 top worry of urban Indians, followed by job loss, crime: Survey
నగరవాసుల చింత అంతా కరోనాపైనే!
author img

By

Published : May 2, 2020, 11:22 AM IST

భారత్​లోని నగరవాసుల చింత అంతా కరోనా వైరస్ గురించే ఉందని ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. వీరికి.. నిరుద్యోగం, నేరాలు, పేదరికం, అసమానతలు వంటి సమస్యలు కరోనా తర్వాతేనని సర్వే పేర్కొంది. అయితే వైరస్​పై పోరులో దేశం సరైన మార్గంలోనే ఉన్నట్టు అధిక మంది అభిప్రాయపడ్డట్లు తెలిపింది.

"నగరాల్లో ఉండే 62శాతం భారతీయులు కరోనాతో ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. 38 శాతం మంది నిరుద్యోగం, 24 శాతం మంది నేరాలు-హింస, 21 శాతం మంది పేదరికం- సామాజిక అసమానతలను పేర్కొన్నారు. అయితే దేశం సరైన మార్గంలోనే అడుగులు వేస్తున్నట్టు 65శాతం మంది అభిప్రాయపడ్డారు."

--- సర్వే.

ప్రపంచవ్యాప్తంగా 28దేశాల్లో మార్చి 20 నుంచి ఏప్రిల్​ 3 మధ్య ఇప్​సోస్​ సంస్థ ఆన్​లైన్​ ప్యానెల్​ వ్యవస్థ ద్వారా 'వాట్​ వర్రీస్​ ద వరల్డ్​' అనే సర్వే నిర్వహించింది.

అయితే కరోనాపై పోరులో తమ దేశం మెరుగైన స్థితిలో లేదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు. చిలీ(80శాతం), ఫ్రాన్స్​(74శాతం), దక్షిణాఫ్రికాలో(71శాతం) ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చైనా(99శాతం), సౌదీ అరేబియా(90శాతం), పెరూ(75శాతం), మలేషియా(66శాతం) దేశాలు భవిష్యత్తుపై ధీమాగా ఉన్నాయి.

ఇదీ చూడండి:- కొవిడ్‌ మాయాజాలం.. రూపు మారనున్న రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.