ETV Bharat / bharat

ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ ఉచితంగా కరోనా పరీక్షలు - కరోనా మరణాలు

ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులందరూ ప్రైవేట్ ల్యాబ్​ల్లో ఉచితంగా కరోనా పరీక్షలతో పాటు చికిత్స చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల 50 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

COVID-19 testing, treatment free for Ayushman Bharat beneficiaries at pvt labs, empanelled hosps
ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ ఉచిత కరోనా పరీక్షలు
author img

By

Published : Apr 4, 2020, 9:22 PM IST

ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే వారందరూ దేశంలోని అన్ని ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా పరీక్షలు, చికిత్స ఉచితంగా చేయించుకోవచ్చని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ఏ) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా కరోనా వైరస్ తో పోరాడటంలో భారత సామర్థ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

"ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్-19 పరీక్షలు, చికిత్స సేవలు ఇప్పటికే ఉచితంగా అందిస్తున్నారు. వైద్య భరోసా పథకం కింద అర్హులైన 50 కోట్ల మంది.. ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ ఇప్పుడు ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చు."

-నేషనల్ హెల్త్ అథారిటీ

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద నమోదు చేసుకున్న ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చని ఎన్​హెచ్​ఏ తెలిపింది. కేసులు ఒక్కసారిగా పెరిగే సమయంలో కరోనా బాధితులకు చికిత్స నిర్వహించడానికి ప్రైవేటు రంగ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని అభిప్రాయపడింది.

భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఆమోదం ఉన్న ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

సామర్థ్యం పెరుగుతుంది

ఇలాంటి విపత్కర సమయంలో కొవిడ్-19పై పోరాడేందుకు కీలకమైన ప్రైవేటు రంగం భాగస్వామయ్యేలా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా పరీక్షలు చేయడం ద్వారా వైరస్ పరీక్షల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.