దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మరో 83,347 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. బాధితుల సంఖ్య 56లక్షల 45వేల 10కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,085 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 90వేల 20కి చేరింది.
దేశవ్యాప్తంగా మంగళవారం 9,53,683 నమూనాలు పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లిండించింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 6.62 కోట్లు దాటింది. రోజూవారీ టెస్ట్‌ల సామర్థ్యం 12లక్షలు దాటిందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
రికవరీ రేటు ఇలా...
పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 81.25 శాతంగా ఉంది. మరణాలు రేటు మరింత ఊరట కలిగిస్తూ 1.59 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: 'కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ'