దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 37 లక్షల 69 వేల 524కు చేరింది. వైరస్ ధాటికి మరో 1,045 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 66వేల 333కు పెరిగింది.
![COVID-19 Single-day spike of 78,357 new positive cases & 1045 deaths reported in India, in the last 24 hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8646505_indiacorona.jpg)
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 10,12,367 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 4 కోట్ల 43 లక్షలకు చేరింది.
![STATE WIDE CORONA CASE DETAILS IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8646505_indiacorona2.jpg)
సానుకూలంగా రికవరీ రేటు..
పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.98 శాతంగా ఉంది. మరణాల రేటు కూడా మరింత ఊరట కలిగిస్తూ 1.76 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: 2036లో దేశ జనాభా 151.8 కోట్లు