దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23 లక్షల మందికిపైగా బాధితులు వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 75.27 శాతంగా నమోదైంది. వ్యాధి వ్యాప్తికంటే రికవరీల రేటు 3 రెట్లు అధికంగా ఉంది. మరోవైపు మరణాల రేటు మరింత ఊరట కలిగిస్తూ.. 1.85 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 57,469 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 23,38,035కు పెరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
3.6 కోట్ల పరీక్షలు..
ఇప్పటివరకు సుమారు 3.6 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు చేపట్టగా.. సగటున ప్రతి పది లక్షల మందికి 26,016ని పరీక్షించారు. ఒక్కరోజు వ్యవధిలో 6,09,917 మందికి టెస్ట్‌లు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా ప్రతి మిలియన్ జనాభాకు టెస్ట్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. కొవిడ్ ల్యాబ్‌లను విస్తరించడం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 61,408 కేసులు.. 836 మరణాలు