దేశంలో కరోనా కేసులు మూడు వేలు దాటాయి. ఒక్కరోజు వ్యవధిలో 775మందికి కరోనా సోకినట్లు తేలింది. 24 గంటల్లో 19మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా 3072మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 75మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 24 మరణాలు, 556 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌తో హృద్రోగులకు అధిక ముప్పు