ETV Bharat / bharat

లాక్​డౌన్​లో వలస కూలీల మరణ గాథ! - కరోనా

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా వలస కార్మికుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి కాలినడకనే స్వస్థలాలకు వెళుతున్న కూలీలపై ఆ విధికి కూడా కరుణలేదు. ఆకలిదప్పికలను లెక్కజేయక ప్రయాణం సాగిస్తున్న వలస జీవులను రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు కబళిస్తోంది.

Courting death and injury, scores of migrants killed in accidents on way home
లాక్​డౌన్​లో వలస కూలీల మరణ గాధ!
author img

By

Published : May 17, 2020, 9:12 AM IST

లాక్​డౌన్ ప్రకటించిన తర్వాత అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది వలస కార్మికులే. కార్యకలాపాలన్నీ ఆగిపోవడం వల్ల కూలీలకు చేయడానికి పని, తినడానికి తిండి లేకుండా పోయింది. దీంతో వారి జీవితాలు రోడ్డున పడ్డాయి. నిలువనీడ కూడా లేని దయనీయ పరిస్థితుల్లో గత్యంతరం లేక పొట్ట చేతబట్టుకొని స్వస్థలాలకు పయనమవుతున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వల్ల కాళ్లనే రథ చక్రాలుగా మలుచుకొని ప్రయాణం సాగిస్తున్నారు.

సొంతగూటికి బయలుదేరడమే వారికి శాపమయ్యిందో ఏమో గానీ.. లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి దాదాపు రోజుకో దుర్ఘటన జరుగుతూనే ఉంది. వలస కార్మికులకు సంబంధించి ఏదో ఒక ప్రమాదం జరిగిన వార్తలు వస్తూనే ఉన్నాయి. లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 139 మంది కూలీలు వివిధ ప్రమాదాల్లో మరణించారన్న వాస్తవం వింటే ఆశ్చర్యం కలుగుతోంది.

సేవ్​లైఫ్​ వాస్తవాలు

లాక్​డౌన్ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సేవ్​లైఫ్ ఫౌండేషన్ సంస్థ వివరాలు వెల్లడించింది. మార్చి 25 నుంచి మొత్తం 2 వేల రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్పష్టం చేసింది. మొత్తం 368 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

ఇందులో 139 మరణాలు స్వస్థలాలకు బయల్దేరిన వలస కూలీలవేనన్న బాధాకర వాస్తవాలు వెల్లడించింది సేవ్​లైఫ్. మరో 27 మంది అత్యవసర సేవల సిబ్బంది సైతం మరణించినట్లు తెలిపింది. మిగిలిన 202 మంది సాధారణ పౌరులని పేర్కొంది.

"మొత్తం 368 మరణాల్లో ఉత్తర్​ప్రదేశ్​లోనే 100 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (30), తెలంగాణ (22), మహారాష్ట్ర (19), పంజాబ్ ​(17) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదాలన్నింటికి ప్రధాన కారణం."-సేవ్​లైఫ్

24 మంది బలి

శనివారం (మే16) రోజున కూడా వలసజీవుల బతుకులపై పిడుగు పడింది. సూర్యోదయం కన్నా ముందే వారి జీవితాలు అస్తమించాయి.

50 మంది కూలీలు తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఉత్తర్​ప్రదేశ్​లోని ఔరయా వద్ద ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడ్డారు.

మరొకటి

కొన్ని గంటల్లోనే వలస కూలీలకు సంబంధించి మరో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లా బండా వద్ద ట్రక్కు బోల్తాపడి ఐదుగురు వలసకూలీల జీవితాలు ఆవిరయ్యాయి. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

రహదారులపై ట్రాఫిక్​ లేకపోవడం, అతివేగంతో వెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ వారంలోనే ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో వందల కొద్ది ప్రమాదాలు సంభవించాయి. ఒక్క గుణ (మధ్యప్రదేశ్​)లోనే గురు శుక్రవారాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో 14 మంది వలస కూలీలు మరణించారు. 60 మంది గాయపడ్డారు.

మే 15న

ఉత్తర్​ప్రదేశ్​లో శుక్రవారం (మే 15న) జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ఆరుగురు కూలీలు మరణించగా.. 95 మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు రోజు పంజాబ్​ నుంచి బిహార్​కు కాలినడకన వెళ్తున్న ఆరుగురు కూలీలు.. ముజఫర్​నగర్​లో జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు.

రైలు పట్టాలపై ఘోరం

ఇంటికెళ్లే దారి కనుక్కోవడానికి సాంకేతికత ఉపయోగించడం తెలియని వారికి.. రైలు పట్టాలే దిక్కయ్యాయి. రోడ్డుమీద నుంచి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో పట్టాలపై నడుస్తూ సొంతరాష్ట్రానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కూలీలు. దురదృష్టవశాత్తు ఆ ఇనుప పట్టాలే వారి బతుకులను ఛిద్రం చేశాయి. ఆదమరిచి ట్రాక్​పై పడుకున్న వారి శరీరాల పైనుంచే రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్​లో మే 8న జరిగిన ఈ భీకర ఘటనలో 16 మంది బలయ్యారు. దగ్గర్లోనే నిద్రిస్తున్న మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రాణాలతో..

అదే రోజు.. లఖ్​నవూ నుంచి ఛత్తీస్​గఢ్​కు వెళ్తున్న దంపతులిద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఐదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలతో సైకిల్​పై ప్రయాణిస్తున్న ఆ కూలీలు అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకోగలిగారు.

లాక్​డౌన్ ప్రారంభం నుంచే

లాక్​డౌన్ ప్రారంభమైన తొలినాళ్ల నుంచే ప్రమాదాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో మార్చి 28న నలుగురు వలస కూలీలపై నుంచి ట్రక్​ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

రెండు రోజులు నడిచీ నడిచీ

రెండు రోజుల తర్వాత... మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో కారు ఢీకొట్టడం వల్ల 40 ఏళ్ల సుఖ్​ లాల్ అహిర్వార్ అనే కూలీ ప్రాణాలు విడిచాడు. తన భార్యతో కలిసి దిల్లీ నుంచి ఏకధాటిగా రెండు రోజులు నడుస్తూనే ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. స్వస్థలం తిలక్​మార్గ్​ చేరుకునే ముందు డివైడర్​ వద్ద సేదతీరారు. అంతలోనే అనంతలోకాలకు చేరాడు అహిర్వార్.

రిక్షాలో వెళ్తుండగా..

మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని జౌన్​పుర్​కు రిక్షాలో బయల్దేరిన ఓ మహిళ, తన ఆరేళ్ల కూతురిపై కాలం కన్నెర్రజేసింది. అప్పటికే 1,300 కిలోమీటర్లు ప్రయాణించిన వీరిని మృత్యువు వెంటాడింది. గమ్యస్థానానికి కాస్త దూరంలో ఉండగా ఓ ట్రక్కు ఢీకొట్టింది.

ప్రభుత్వం స్పందించినా..

చివరకు.. ఇలా వలస కార్మికులు రోజుల తరబడి నడుస్తూనే స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుంది. ప్రత్యేక శ్రామిక్​ రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఇప్పటివరకు 12 లక్షల మంది కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చింది. అయితే ఇప్పటికీ వలస కూలీల ప్రమాద ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.