ETV Bharat / bharat

లాక్​డౌన్​ 3.0లో వీటికి మాత్రమే అనుమతి - Coronavirus: Lockdown extended for 2 weeks, some activities may resume in green zones

దేశవ్యాప్తంగా మే 4 నుంచి రెండు వారాలు లాక్​డౌన్​ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏఏ వాహనాల రవాణాకు అనుమతి ఉంటుంది? వేటికి ఉండదు? ఎలాంటి షాపులను తెరిచి ఉంచొచ్చు అన్న వివరాలు గమినిస్తే...

Coronavirus: Lockdown extended for 2 weeks, some activities may resume in green zones
మే 17వరకు లాక్​డౌన్​లో అనుమతి వీటికే...
author img

By

Published : May 1, 2020, 7:31 PM IST

Updated : May 1, 2020, 8:30 PM IST

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను మే 17వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన లాక్​డౌన్​ మే 3న ముగియనుండగా.. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మరో రెండు వారాలు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ లాక్​డౌన్​లో ఏఏ వాహనాల రవాణాకు అనుమతి ఉంటుంది? వేటికి ఉండదు? ఎలాంటి షాపులను తెరిచి ఉంచొచ్చు అన్న వివరాలు గమినిస్తే...

లాక్​డౌన్​లో అనుమతి లేనివి..

  • పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కేంద్రాలు మూసివేసే ఉంటాయి.
  • మతపరమైన కేంద్రాలు తెరుచుకోవు
  • అత్యవసరం కాని పనులకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు అనుమతి లేదు
  • 65ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల పిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలి
  • రెడ్‌ జోన్లలో సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు అనుమతి ఉండదు
  • సెలూన్లకు కూడా అనుమతి లేదు
  • అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదు

వీటికి అనుమతి

  • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఉంటుంది
  • రెడ్‌జోన్లలో ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్‌ సెంటర్లకు అనుమతి
  • ఆరెంజ్‌ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్‌, ఒక సహాయకుడి సాయంతో అనుమతి
  • గ్రీన్‌ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడి
  • గ్రీన్‌ జోన్లలో 50శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతి

పెళ్లికి 50 మంది.. అంత్యక్రియలకు 20

  • బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి, భౌతికదూరం పాటించాలి
  • బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి కంటే మించి ఉండరాదు
  • వివాహాల వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
  • అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషేధం

Last Updated : May 1, 2020, 8:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.