ETV Bharat / bharat

ఒక్క రోజులో 88 కేసులు.. వ్యాప్తి రేటు తగ్గుముఖం - కరోనా వైరస్ భద్రత

భారత్​లో గురువారం ఒక్కరోజే అత్యధికంగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ అంతర్గతంగా వ్యాప్తి జరుగుతున్నట్లు నిర్ధరించలేమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగతా దేశాలతో పోలిస్తే వైరస్ వ్యాప్తి రేటు తగ్గిందని పేర్కొంది.

corona
దేశంలో కరోనా వైరస్
author img

By

Published : Mar 26, 2020, 10:34 PM IST

Updated : Mar 27, 2020, 5:33 AM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 88 కేసులు నమోదుకాగా కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 694కు చేరుకుంది.

కరోనా బారిన నిన్న మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఫలితంగా దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. మరో 44 మంది కోలుకున్నారని.. ఒకరు దేశం విడిచివెళ్లటం వల్ల ప్రస్తుతం కరోనా ఆక్టివ్​ కేసుల సంఖ్య 633గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

corona
రాష్ట్రాల వారీగా వివరాలు

స్థిరంగానే వ్యాప్తి రేటు..

భారత్​లో ఒక్కరోజే 88 కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి. అయితే దేశంలో అంతర్గతంగా వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు సరైన ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను గమనిస్తే వృద్ధి రేటు స్థిరంగానే ఉన్నట్లు తెలిపింది.

"దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల స్థిరంగానే ఉంది లేదా వృద్ధి రేటులో కొంచెం తగ్గింపు కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ఆధారంగా దేశంలో పరిస్థితిని అంచనా వేయలేం."

-లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులను ప్రారంభించినట్లు అగర్వాల్ వెల్లడించారు. దోమల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. లాక్​డౌన్​కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్​లతో మాట్లాడినట్లు తెలిపారు. దిల్లీ ఎయిమ్స్​తో కలిసి వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు.

"సామాజిక దూరం పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరిస్తూ సరైన సమయంలో చికిత్స చేయించుకున్నట్లయితేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలం. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన లాక్​డౌన్​ విజయవంతం కావాలంటే ప్రజల సహకారం కీలకం. ప్రజలందరూ సహకరించాలి."

దేశవ్యాప్తంగా 64,411 మందిపై నిఘా పెట్టినట్లు అగర్వాల్ తెలిపారు. వీరిలో 8,300 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్నారని.. మిగిలిన వారు తమతమ గృహాల్లో నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ప్రయాణాలపై ఆంక్షలు విధించకముందు దేశానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

సవాల్​కు సిద్ధం..

కరోనా సవాల్​ను ఎదుర్కొనేందుకు భారత్​ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు అగర్వాల్​. ప్రయాణాలపై ఆంక్షలకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందం సమావేశమైందని.. దీనిపై ప్రజలకు త్వరలోనే ప్రకటన చేస్తారని హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్​ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అత్యవసర సేవలను మినహాయింపు ఇచ్చారు.

ఇదీ చూడండి: కేంద్రం సంక్షేమ యజ్ఞం- కష్టకాలంలో పేదలకు ఆపన్నహస్తం

Last Updated : Mar 27, 2020, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.