ETV Bharat / bharat

'ఆ 17రోజుల తర్వాత హోం క్వారంటైన్​కు స్వస్తి' - health ministry news

హోం క్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నపాటి వైరస్​ లక్షణాలు బయటపడిన వారు.. 17రోజులకు హోం క్వారంటైన్​​కు స్వస్తి పలకవచ్చని తెలిపింది.

Corona Virus infected patients
ఇకపై కరోనా టెస్టింగ్​ అవరసరం లేదు!
author img

By

Published : May 11, 2020, 8:05 PM IST

హోం క్వారంటైన్​లో ఉండే కరోనా వైరస్​ రోగులకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్​ లక్షణాలు బయట పడిన 17రోజులకు... లేదా నమూనాలు సేకరించిన తేదీ నుంచి 17రోజుల తర్వాత తమ హోం క్వారంటైన్​ సమయాన్ని ముగించవచ్చని తెలిపింది. మరోమారు పరీక్షలు జరగకపోయినా.. 10రోజుల్లో జ్వరం తగ్గిపోతే కూడా క్వారంటైన్​ నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేసింది. ఆదివారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో తాజాగా ఈ మార్పులు చేసింది. చిన్నపాటి లక్షణాలు ఉన్నవారికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

చిన్నపాటి లక్షణాలు ఉన్నవారికి సౌకర్యాన్ని బట్టి హోమ్​ క్వారంటైన్​ సూచిస్తున్నారు. అయితే వారు కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ వైద్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి పర్యవేక్షక అధికారికి తెలియజేయాలి.

తేలికపాటి కరోనా లక్షణాలతో గృహ నిర్బంధంలో ఉండేవారికి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఓసారి చూద్దాం.

ఎవరు ఉండాలి?

గృహ నిర్బంధంలో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి ధ్రువీకరించాలి. స్వీయ నిర్బంధంతో పాటు కుటుంబం క్వారంటైన్​లో ఉండేందుకు తగిన సదుపాయాలు ఉండాలి. స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు అండర్​టేకింగ్ ఫారాన్ని సమర్పించాలి.

  • 24 గంటలు సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. అతను లేదా ఆమె ఆసుపత్రి లేదా వైద్యులతో సంప్రదింపులు జరపాలి.
  • సంరక్షుడితో పాటు నిర్బంధంలో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ప్రొఫీలాక్సిస్​ మాత్రలను కచ్చితంగా తీసుకోవాలి.
  • ఆరోగ్య సేతు యాప్​ మొబైల్​ ఫోన్​లో తప్పనిసరిగా ఉండాలి.
  • తన ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నిఘా అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి.

వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?

  • లక్షణాలు తీవ్రమవుతుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
  • శ్వాస తీసుకోవటంలో సమస్యలు, ఛాతీ నొప్పి, మానసిక ఒత్తిడి, అశక్తత, ముఖం, పెదవులు నీలిరంగులోకి మారటాన్ని గుర్తిస్తే వెంటనే స్పందించాలి.
  • కనిష్ఠంగా 17 రోజుల తర్వాత స్వీయ నిర్బంధం నుంచి విముక్తి కావచ్చు. 10 రోజులుగా జ్వరం లేకుండా ఉంటే ఎలాంటి నిర్ధరణ పరీక్ష అవసరం లేకుండానే విడుదల అవ్వచ్చు.

సంరక్షకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • రోగితో ఉన్నప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కు ధరించాలి. దానిని ముట్టుకోవద్దు. మాస్కు తడిసిపోతే వెంటనే తొలగించాలి.
  • ముఖం, ముక్కు, నోటిని ముట్టుకోవద్దు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం టవల్​ లేదా టిష్యూ పేపర్​తో తుడుచుకోవాలి.
  • రోగి శరీర ద్రవాలను తాకవద్దు. ముఖ్యంగా నోరు, శ్వాసకోశాల నుంచి వచ్చే బిందువులను మన మీద పడనీయకూడదు.
  • రోగికి అతని గదిలోనే భోజన ఏర్పాట్లు చూడాలి. అతను వాడిన పాత్రలను గ్లౌజులు వేసుకుని సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • పరిసరాలు శుభ్రం చేసేటప్పుడు, రోగికి దుస్తులు మార్చేటప్పుడు మాస్కుతో పాటు గ్లోవ్స్​ కూడా ధరించాలి. వాటిని వేసుకునే మందు, తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.
  • రోజువారీగా ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతను సరిచూసుకోవాలి. ఏదైనా లక్షణాలు బయటపడితే వెంటనే వైద్య సాయం పొందాలి.

రోగి పాటించాల్సినవి..

  • అన్ని వేళల్లో సర్జికల్​ మాస్కు ధరించటం తప్పనిసరి. 8 గంటల తర్వాత లేదా తడిగా మారితే తొలగించాలి. దానిని సోడియం హైపోక్లోరైట్​ ద్రావణంతో శుభ్రపరిచిన తర్వాతే పడేయాలి.
  • తప్పనిసరిగా ప్రత్యేక గదిలోనే ఉండాలి. ఇతరులతో ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి.
  • రోగి తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
  • తరచూ చేతులను 40 సెకన్లపాటు సబ్బుతో కడగాలి. లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్​ వాడాలి.
  • వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. గదిలో తరచూ తాకే వస్తువులు, ఉపరితలాలను ఒక శాతం హైపోక్లోరైట్​ ద్రావణంతో శుభ్రం చేస్తూ ఉండాలి.
  • వైద్యుల సూచనలను పాటిస్తూ మందులను క్రమ తప్పకుండా వేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత, వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.