దేశంలో కరోనా వైరస్ కేసులు శుక్రవారం భారీసంఖ్యలో పెరిగాయి. ఒక్కరోజులోనే 2293 మంది వైరస్ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లో మొత్తం కేసులు 37 వేల 336కు చేరాయి. ఇప్పటివరకు 1218 మరణించారు. మొత్తం 9950 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26 వేల 167గా ఉన్నాయి.
మహారాష్ట్రలో కేసులు 11 వేల 506కు చేరగా.. 485 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్లో 236, మధ్యప్రదేశ్‌లో 145 మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో 1463, తెలంగాణలో 1039 మంది కరోనా బారిన పడ్డారు. ఈ రాష్ట్రాల్లో వరుసగా 33, 26 మంది చొప్పున వైరస్‌కు బలయ్యారు.