ETV Bharat / bharat

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 392 మంది మృతి - కరోనావైరస్ కేసులు

భారత్​లో లాక్​డౌన్​ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11,933 కేసులు నమోదయ్యాయి. 392 మృత్యువాత పడ్డారు. 1,344 మంది కోలుకున్నారు.

CORONA CASES
దేశంలో విజృంభిస్తోన్న కరోనా
author img

By

Published : Apr 16, 2020, 4:29 AM IST

Updated : Apr 16, 2020, 5:48 AM IST

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,933కి చేరింది. 392 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,344 మంది కోలుకున్నారు.

ముంబయిపై పడగ..

మహారాష్ట్రపై కరోనా విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 వేలకు చేరువలో ఉంది. ఒక్క ముంబయిలోనే 1,936 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 187 చనిపోగా.. ముంబయి మహానగరంలోనే 113 మంది మృతి చెందారు.

ముంబయిలోని అతిపెద్ద మురికివాడ థారావిలో కరోనా పంజా విసురుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 60 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు.

వైద్య సిబ్బందికి వైరస్​

ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకటం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్న 10 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వారందరికీ ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.

దేశ రాజధానిలో..

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,578కి చేరింది. ఇప్పటివరకు 32 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న బాధితులకు ప్లాస్మా చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాజస్థాన్​లో వెయ్యి కేసులు..

గతవారం నుంచి రాజస్థాన్​లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు 1,034కు చేరాయి. 11 మంది మృతి చెందారు. జైపుర్​, జోధ్​పుర్​, కోటా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.

మధ్యప్రదేశ్​లో

రాష్ట్రంలో ఇప్పటికే 800 కేసులు నమోదయ్యాయి. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్​పై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ 544 కేసులు నమోదు కాగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్​లో మరణాల రేటు 6.8 శాతంగా ఉంది.

గుజరాత్​లో..

గుజరాత్​లోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం కొత్తగా 127 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 766కు చేరింది. ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

ఆయనతో భేటీ అయిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్​లో ఉన్నారు. రూపానీకి నిర్ధరణ పరీక్షల్లో వైరస్ లేనట్లు తేలింది.

తమిళనాట..

దిల్లీ మత ప్రార్థనల ప్రభావంతో తమిళనాడులో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. ఇప్పటివరకు 1,242 కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించారు.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయండి'

Last Updated : Apr 16, 2020, 5:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.