ETV Bharat / bharat

సీజేఐకి ప్రాణహాని- జెడ్ ప్లస్ భద్రత కల్పన - సీజేఐ బోబ్డే

వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయన భద్రతను జెడ్​ నుంచి జెడ్​ ప్లస్​కు మార్చింది.

Chief Justice S A Bobde's security cover upgraded to Z-plus
సీజేఐ జస్టిస్​ బోబ్డే ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు..!
author img

By

Published : Jul 30, 2020, 4:54 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయనకు జెడ్​ ప్లస్​ భద్రతను కల్పించింది.

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో.. 64 ఏళ్ల సీజేఐ జస్టిస్​ బోబ్డే ఒకరు.

ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్​ కేటగిరీ భద్రత ఉండేది. దానిని జెడ్​ ప్లస్​ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జస్టిస్​ బోబ్డే సీఆర్​పీఎఫ్​, సీఏపీఎఫ్​ బలగాలు భద్రతలో ఉండనున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే 2019 నవంబర్​ 18న బాధ్యతలు చేపట్టారు.

ఇవీ చూడండి:-

'అయోధ్య, కశ్మీర్​లో దాడులకు ఉగ్రకుట్ర'

అయోధ్య రామ మందిర పూజారి, పోలీసులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.