ETV Bharat / bharat

మోదీ లాక్​డౌన్ వ్యూహం​ పూర్తి విఫలం: రాహుల్​

కొవిడ్​-19 కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్​డౌన్​ వ్యూహం ఫలించలేదని విమర్శించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. నాలుగు దఫాలుగా అమలు చేసిన లాక్​డౌన్​ ప్రధాని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్న ఆయన.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సాయం అత్యవసరమని వెల్లడించారు.

Centre's lockdown strategy has failed: Rahul Gandhi
మోదీ లాక్​డౌన్ వ్యూహం​ పూర్తి విఫలం: రాహుల్​
author img

By

Published : May 26, 2020, 1:03 PM IST

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ. వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎందుకు ఎత్తివేసిందని ప్రశ్నించారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

" కొవిడ్​-19 కేసులు భారీగా నమోదవుతున్న సమయంలో లాక్​డౌన్​ను ఎత్తివేసిన ఏకైక దేశం భారత్​. నాలుగు దశలుగా విధించిన లాక్​డౌన్.. ప్రధానమంత్రి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దేశంలో లాక్​డౌన్​ ఉద్దేశ్యం, లక్ష్యం విఫలమయ్యాయన్నది సుస్పష్టం. భారత్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి.. విఫలమైన లాక్‌డౌన్‌ ఫలితమే. కరోనా అంటువ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో లాక్​డౌన్​ ఎత్తేసి.. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది. నిబంధనలు సడలించడంలో ప్రభుత్వ వ్యూహం ఏమిటి? వలస కార్మికులు, రాష్ట్రాలకు ఈ వ్యూహం ఏ విధంగా సాయపడుతుందని అనుకుంటోంది.

పరిశ్రమలు, ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇవ్వకపోతే.. తీవ్ర సంక్షిష్ట పరిస్థితి ఎదురవుతుంది. కేంద్రం రాష్ట్రాలకు సాయం చేయాలి. ప్రభుత్వ సహకారం కరవైతే.. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలకు కష్టంగా ఉంటుంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఇదీ చదవండి : కరోనా సడలింపులపై పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.