ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఉంటే.. కర్ణాటకలో అధికార భాజపా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి వైరస్ సోకకుండా భౌతిక దూరంతో పాటు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా.. ఓ బాధ్యతాయుత చట్టసభ సభ్యుడై ఉండి కూడా.. ఇందుకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు చేసుకున్నందున సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుబ్బి తాలూకాలోని ఇడుగూరు గ్రామంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.