ETV Bharat / bharat

భారత్​-నేపాల్​ మధ్య 'వాచ్​ టవర్​' వివాదం - వాచ్​ టవర్​

భారత్​ సరిహద్దు వద్ద నేపాల్​ వాచ్ టవర్ నిర్మాణం చేయడం వల్ల సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. సరిహద్దులోని భారత కార్యకలాపాలపై నిఘా ఉంచాలని నేపాల్​పై చైనా ఒత్తిడి పెంచినట్టు.. అందుకే వాచ్​ టవర్​ను నిర్మించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Bihar: Watch tower construction sparks India, Nepal border row
భారత్​-నేపాల్​ మధ్య సరికొత్త వివాదం
author img

By

Published : Jun 25, 2020, 8:09 PM IST

భారత్​-నేపాల్​ మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా బిహార్​లోని పంతోక గ్రామానికి సమీపంలో ఉన్న సరిహద్దు వద్ద ఓ వాచ్​ టవర్​ను నిర్మించింది నేపాల్​. ఇది నేపాల్​ సైనికుల గస్తీకి ఉపయోగపడనుంది.

అయితే ఈ వాచ్​ టవర్​ వివాదానికి చైనా పరోక్ష కారణమని తెలుస్తోంది. వాచ్​ టవర్​ను ఏర్పాటు చేయడానికి నేపాల్​పై చైనా ఒత్తిడి పెంచినట్టు సమాచారం. భారత్​ వ్యవహారాలపై నిఘా పెట్టడానికే నేపాల్​ను చైనా ఈ విధంగా ప్రోత్సహించి ఉండొచ్చు.

స్తంభం నెం 392/13- స్తంభం నెం 392/18 మధ్య ఈ టవర్​ను నిర్మించింది నేపాల్​.

అయితే సరిహద్దు గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన రెండు స్తంభాల మధ్య ఉండాల్సిన ఓ చిన్న స్తంభం కనపడటం లేదని సశస్త్ర సీమా బల్ అధికారులు వెల్లడించారు.

మరోవైపు నేపాల్​ చర్యలపై బీహార్​ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. గండక్ బ్యారేజీపై మరమ్మతు పనులను నేపాల్ ప్రభుత్వం అడ్డుకోవటంపై ఇప్పటికే మండిపడ్డారు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్​ కుమార్​. ఈ బ్యారేజీ వల్ల బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నేపాల్​లోని టెరాయ్​ ప్రాంతాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. రెండు దేశాలు కలిసి బ్యారేజీ 18 గేట్లను పంచుకున్నాయి.

ఇదీ చూడండి:'పార్లమెంట్​ సమావేశాలను వర్చువల్​ విధానంలో నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.