ETV Bharat / bharat

కర్ణాటకలో బంద్​.. ఆంధ్రప్రదేశ్​ బస్సుపై రాళ్ల దాడి - కర్ణాటకలో బంద్​

కన్నడీగులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చేపట్టిన బంద్​ చెదురుమదురు ఘటనల మధ్య సాగుతోంది. మంగళూరులో ఆంధ్రప్రదేశ్​ పర్యటకశాఖకు చెందిన బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Bandh in Karnataka
కర్ణాటకలో బంద్​.. ఏపీ పర్యటక బస్సుపై రాళ్ల దాడి
author img

By

Published : Feb 13, 2020, 10:52 AM IST

Updated : Mar 1, 2020, 4:41 AM IST

కర్ణాటకలో బంద్​.. ఆంధ్రప్రదేశ్​ బస్సుపై రాళ్ల దాడి

కర్ణాటక మంగళూరులో ఆంధ్రప్రదేశ్​ పర్యటక శాఖకు చెందిన ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరుపతి నుంచి మంగళూరు వెళుతుండగా బస్సుపై దాడికి పాల్పడ్డారు నిరసనకారులు.

బంద్​కు పిలుపు..

ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో కన్నడీగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కర్ణాటకలో పలు సంఘాలు బంద్​ చేపట్టాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి 1986లో.. కేంద్ర మాజీ మంత్రి సరోజినీ మహిషి కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలంటూ.. 'కర్ణాటక సంగతనేగల ఒక్కూట' అనే సంస్థ ఆధ్వర్యంలో బంద్​ నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో సిటీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నప్పటికీ.. ప్రయాణికులు కనిపించటం లేదు. కొన్ని ఆటో సంఘాలు బంద్​కు మద్దతు ఇస్తుండగా మరికొన్ని చోట్ల వాహనాలు నడుస్తున్నాయి. ప్రధాన మార్కెట్​ కూడలి కేఆర్​ మార్కెట్​, పరిసర ప్రాంతాల్లో బంద్​ ప్రభావం కనిపించటం లేదు. ఆందోళనకారులు నగరంలో తిరుగుతూ.. దుకాణాలు మూసివేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

భారీ భద్రత..

ముఖ్యమైన ప్రదేశాలు, వ్యాపార కూడళ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు ముఖ్యమంత్రి యడియూరప్ప.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై భార్యను ఈడ్చుకెళ్లిన 'పోలీస్'​ భర్త!

Last Updated : Mar 1, 2020, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.