ETV Bharat / bharat

సైన్యాధిపతిగా సెలవు.. సీడీఎస్​గా రేపు రావత్​ బాధ్యతలు - రావత్​

సైన్యాధిపతిగా జనరల్ బిపిన్​ రావత్​ ఇవాళ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 28వ సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దేశ ప్రథమ చీఫ్ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​గా రావత్​ విధులు నిర్వర్తిస్తారు.

Army Chief General Bipin Rawat will take over as first Chief of Defence Staff on January 1.
సైన్యాధిపతిగా రావత్​ సెలవు.. సీడీఎస్​గా రేపు బాధ్యతలు
author img

By

Published : Dec 31, 2019, 10:17 AM IST

Updated : Dec 31, 2019, 12:15 PM IST

దేశ మొట్టమొదటి త్రివిధ దళాల ప్రధానాధికారి నియమితులైన జనరల్​ బిపిన్‌ రావత్‌.. ఇవాళ సైన్యాధ్యక్ష పదవీ విరమణ చేశారు. రేపు చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​-సీడీఎస్​గా​ బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీడీఎస్​ పదవికి గరిష్ఠ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే.. 28వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సైన్యాధిపతిగా పదవీ విరమణ చేయడానికి ముందు.. దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు రావత్​. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికులందరికీ కృతజ్ఞతలతో పాటు నూతన ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టనున్న నరవణేకు అభినందనలు తెలిపారు. దేశభద్రత కోసం ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు రావత్​.

సైన్యం సర్వసన్నద్ధం

" ఎన్నో సవాళ్ల మధ్య ధైర్యంగా విధులు నిర్వహిస్తూ.. సైనిక సంప్రదాయాలను కొనసాగిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఉత్తర, పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో చలికాలంలో అతిశీతల గాలులు వీస్తున్నా ఎలాంటి సంకోచం లేకుండా దృఢనిశ్చయంతో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా."
- బిపిన్​ రావత్​

AP Video Delivery Log - 0300 GMT News
Tuesday, 31 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0256: Australia Fires Part no access Australia; Part must credit content creator 4246842
Fierce fires still burning in Victoria, NSW
AP-APTN-0117: US OR Climber Rescue Must credit KPTV/KATU/KGW, No access Portland, No use US broadcast networks, No re-sale, re-use or archive 4246840
Injured teen rescued after fall on Mount Hood
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 31, 2019, 12:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.